HomeUncategorizedAP Cabinet | ఏపీ కేబినెట్‌లో కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌.. వారికి శుభ‌వార్త‌..

AP Cabinet | ఏపీ కేబినెట్‌లో కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌.. వారికి శుభ‌వార్త‌..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : AP Cabinet | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు రాష్ట్ర కేబినెట్ సమావేశం సచివాలయంలో జరిగింది. రాష్ట్రాభివృద్ధికి దోహదపడే పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చలు నిర్వ‌హించ‌గా, ఇందులో మహిళల ఉచిత ప్రయాణం, పర్యాటక అభివృద్ధి, కొత్త నిబంధనలు, విద్యుత్ సబ్సిడీ వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు.

స్త్రీ శక్తిని ప్రోత్సహించే దిశగా మరో ముందడుగు వేస్తూ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ప్రకటించారు. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క కేబినెట్‌ మంత్రి(Cabinet Minister) పాల్గొనాలని సీఎం స్పష్టం చేశారు.

AP Cabinet | కీల‌క అంశాలపై చ‌ర్చ‌..

స్వాతంత్ర దినోత్సవం (Independence Day) నాడు పలు కార్యక్రమాలు ఉండే అవకాశం ఉన్నందున, కొంతమంది మంత్రులు తమ అభ్యంతరాలు వ్యక్తం చేయగా, “సమయాన్ని సర్దుబాటు చేసుకుని తప్పకుండా పాల్గొనాలి” అని సీఎం స్పష్టం చేశారు. సింగపూర్ పర్యటనలో (Singapore Trip) జరిగిన పరిణామాలపై సీఎం మంత్రులతో వివరాలు పంచుకున్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ హయాంలో సింగపూర్ ప్రతినిధులపై ఒత్తిళ్లు తెచ్చారు. కేసులతో బెదిరించిన కారణంగా వారు ఆంధ్రప్రదేశ్‌కు రానని అప్పట్లో తేల్చిచెప్పారు. కానీ ఇప్పుడు మళ్లీ మంచి సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. సింగపూర్ పర్యటనలో మొత్తం 41 సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. వచ్చే నవంబర్‌లో విశాఖపట్నంలో (Vishakapatnam) పెట్టుబడుల సదస్సు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అందుకు సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించినట్లు తెలిపారు.

స్త్రీ శక్తి పథకం (Women Power Scheme) అమలుతో ఆటో రవాణా వ్యవస్థపై ప్రభావం ఉండొచ్చన్న ఆందోళనల నేపథ్యంలో, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచన మేరకు, ఆటో డ్రైవర్లతో  సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. “వారి సమస్యలు వినాలి, అవసరమైన సాయం చేయాలి అని సీఎం స్పష్టం చేశారు.

కేబినెట్ సమావేశం(Cabinet Meeting)లో కొత్త బార్ పాలసీకి ఆమోదం లభించింది. ఈ సందర్భంగా చంద్రబాబు హెచ్చరించారు. కల్లు గీత కార్మికుల పేరుతో బినామీలు షాపుల్లోకి వస్తే సహించం” అని స్పష్టం చేశారు. 2024-29 ల్యాండ్ ఇనిషియేటివ్స్ అండ్ టెక్ హబ్స్ (లిఫ్ట్) పాలసీపై చలు చేసి, దానిపై కూడా ఓ నిర్ణయం తీసుకోనుంది. రాఖీ సందర్భంగా మహిళలకు బహుమతిగా ఇవ్వాలని విష‌యంలో ఓ నిర్ణయం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

జిల్లాల పునర్విభజనలో లోపాలు, సరిహద్దు సమస్యలపై నెలరోజుల్లో నివేదిక ఇవ్వాల‌ని సీఎం అన్నారు. ఇక జ‌నగణన ప్రారంభమయ్యేలోపు ప్రక్రియ పూర్తి చేయాలి అని కూడా సీఎం తెలియ‌జేశారు. పర్యాటక శాఖ పరిధిలోని 22 హోటళ్లు, రిసార్టులు, క్లస్టర్ల నిర్వహణకు ఏజెన్సీ ఎంపిక బాధ్యతలను సంబంధిత శాఖ ఎండీకి అప్పగించే విషయంలో కూడా చ‌ర్చ జ‌రిగింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారులకు ఊతంగా సెలూన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చే విష‌యంతో పాటు, జర్నలిస్టుల కోసం మీడియా అక్రిడిటేషన్‌కు సంబంధించిన కొత్త నిబంధనలు రూపొందించే అంశాల‌పై చ‌ర్చ జరిగినట్టు తెలుస్తోంది.