అక్షరటుడే, వెబ్‌డెస్క్ : AO caught by ACB | కొందరు ప్రభుత్వ అధికారుల్లో అవినీతి జాడ్యం లోతుగా పాతుకుపోయింది. అవినీతి నిరోధకశాఖ ACB అధికారులు ఎన్ని దాడులు చేపట్టినా.. వీరిలో మార్పు ఉండటం లేదు.
ఓ వైపు సర్కారు నుంచి రూ. లక్షల్లో వేతనం అందుతున్నా.. బల్ల కింద చేతివాటం ప్రదర్శించడం మానడం లేదు. లంచం కోసం సామాన్యులను పీక్కుతింటున్నారు. ప్రతి పనికి ఓ రేటు కడుతున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు.
ఇక విషయానికి వస్తే.. తెలంగాణలోని వికారాబాద్ Vikarabad జిల్లాలో మండల వ్యవసాయ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.
విత్తనాలు, ఎరువులు & పురుగు మందుల దుకాణం ఏర్పాటుకు లైసెన్స్ జారీ చేయడానికి మోమిన్‌పేట ఏవో భూపతి జయ శంకర్ AO Bhupathi Jaya Shankar ఏకంగా రూ. లక్ష డిమాండ్ చేశాడు. చివరికి రూ. 50 వేలకు ఫిక్స్ అయ్యాడు. కాగా, బాధిత వ్యాపారి అనిశా అధికారులను ఆశ్రయించాడు.
ఈ మేరకు పక్కా ప్రణాళిక రచించారు. జయ శంకర్ రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
AO caught by ACB | రైతులను పీడిస్తున్నారు
రాష్ట్రంలోని పలు వ్యవసాయ కార్యాలయాలు అవినీతికి కేంద్రాలుగా మారాయి. పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే వ్యాపారులు, రైతులను అధికారులు లంచాల పేరిట పీడిస్తున్నారు.
డబ్బులు ఇస్తేనే పనులు చేస్తున్నారు. లేదంటే కార్యాలయాల చుట్టూ తిప్పుకొంటున్నారు. అటెండర్ నుంచి మొదలు పెడితే మండల వ్యవసాయాధికారి వరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ప్రజలు చెబుతున్నారు.
AO caught by ACB | లంచం ఇవ్వొద్దు
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు.
1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు.
ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు.
ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.