అక్షరటుడే, కామారెడ్డి : Gampa Govardhan | పార్టీ గీత దాటి వ్యవహరిస్తే ఎవరైనా ఒకటేనని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సస్పెన్షన్‌తో పార్టీ అధినేత కేసీఆర్ నిరూపించారని కామారెడ్డి (Kamareddy) మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ (Gampa Govardhan) అన్నారు.
ఆయన తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్‌పై మంగళవారం మీడియాతో మాట్లాడారు. 60 లక్షల కార్యకర్తలు ఉన్న పార్టీ బీఆర్ఎస్ అని తెలిపారు. పార్టీలో ఉన్నవారు ఎంత పెద్దవారైనా పార్టీ క్రమశిక్షణకులోబడి పని చేయాలన్నారు. క్రమశిక్షణ విషయంలో తప్పు చేస్తే కూతురైనా, కొడుకైన ఒకటేనని గతంలో కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు.
ఎమ్మెల్సీ కవిత కొంతకాలంగా పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా కార్యక్రమాలు చేపడుతున్నారని, అన్నింటినీ గమనించిన కేసీఆర్ సస్పెండ్ చేశారని తెలిపారు. పార్టీ పేరు చెప్పి పార్టీ నష్టానికి గురిచేసే ఎంత పెద్ద వారికైనా ఇలాంటి నిర్ణయమే ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్యకర్తల కంటే తన కూతురు ముఖ్యం కాదని నిరూపించారని తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ (BRS) జిల్లా అధ్యక్షుడు ముజీబోద్దీన్ పాల్గొన్నారు.