అక్షరటుడే, వెబ్‌డెస్క్: Anvesh Instagram | వివాదాస్పద యూట్యూబర్ అన్వేష్ ఇన్స్టాగ్రామ్ ఖాతాను మెటా తొలగించింది. హిందూ దేవతలను,భారతదేశాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందున, మత విద్వేషాలు రెచ్చగొట్టడం వంటి చర్యల నేపథ్యంలో నా అన్వేషణ అన్వేష్‌పై కేసు నమోదు అయింది. ఈ మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు Hyderabad CCS police లేఖ రాయడంతో అతడి ఖాతాను మెటా యాజమాన్యం రద్దు చేసింది. దీంతో మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న అన్వేష్ ఖాతా రద్దు అయింది.
Anvesh Instagram | కరాటే కళ్యాణి ఫిర్యాదు
ప్రపంచ దేశాల్లో పర్యటిస్తూ వీడియోలు, రీల్స్ చేసే అన్వేష్.. గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికల ద్వారా భారత్‌తోపాటు హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అన్వేష్ వ్యాఖ్యలపై నటి కరాటే కల్యాణి Actress Karate Kalyani ఘాటుగా స్పందించారు. ఆయన వ్యాఖ్యలు హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, భారత్ గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయని పేర్కొంటూ హైదరాబాద్ సీసీఎస్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.
Anvesh Instagram | ఇన్స్టాగ్రామ్ ఫౌండర్స్‌కు పోలీసుల లేఖ
ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్వేష్ అకౌంట్ డిలిట్ చెయ్యాలని ఇన్‌స్టా నిర్వాహకులకు లేఖ రాశారు. ఈ మేరకు పోలీసులు తమ లేఖలో ఆధారాలను పొందుపరిచారు. సమాజంలో అశాంతిని పెంచేలా, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్న అతడి ఇన్‌స్టా ఖాతాను వెంటనే తొలగించాలని మెటా యాజమాన్యాన్ని కోరారు. ఈ మేరకు మెటా యాజమాన్యం చర్యలు చేపట్టింది. అన్వేష్ ఖాతాను తొలగించింది.