అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ghati Movie | ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అనుష్క శెట్టి ప్రస్తుతం టఫ్ ఫేజ్ ఎదుర్కొంటుంది. ఆమె చేసిన సినిమాలు అంత విజయం సాధించడం లేదు. ఇటీవల ఘాటి చిత్రం(Ghati Movie)తో ప్రేక్షకులని పలకరించగా, ఈ చిత్రం దారుణమైన పరాజయం చవి చూసింది.
వారం రోజుల్లోనే ఈ మూవీని థియేటర్స్ నుండి తీసేసారు. ఈ నేపథ్యంలో అనుష్క శెట్టి(Anushka Shetty) తన అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తే నిర్ణయం తీసుకున్నారు. కొంతకాలం పాటు సోషల్ మీడియా నుండి విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆమె తన చేతిరాతతో రాసిన ఒక నోట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Ghati Movie | తాత్కాలిక విశ్రాంతి..
“బ్లూ లైట్ నుంచి క్యాండిల్ లైట్‌కి…” అంటూ అనుష్క భావోద్వేగంగా పోస్ట్ పెట్టింది. అందులో “బ్లూ లైట్ నుంచి క్యాండిల్ లైట్‌కి మారుతున్నాను.స్క్రోలింగ్‌కు అతీతంగా ఉన్న నిజమైన ప్రపంచంతో మళ్లీ కనెక్ట్ కావడానికి కొంత విరామం తీసుకుంటున్నాను” అని చెప్పారు. తన అభిమానులని ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండండి అంటూ ప్రేమతో సందేశమిచ్చిన స్వీటీ, త్వరలోనే మరిన్ని కథలతో తిరిగి వస్తానని తెలిపారు.చివరిగా అనుష్క శెట్టి ఘాటి చిత్రంతో ప్రేక్షకులని పలకరించగా, సెప్టెంబర్ 5న విడుదలైన ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు(Vikram Prabhu)తో కలిసి నటించింది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ కు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన వచ్చినా, అనుష్క పోషించిన ‘శీలావతి’ పాత్రకు మాత్రం విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.
అయితే సినిమా విడుదలైన కొద్ది రోజులకే ఆమె ఇలా సోషల్ మీడియా(Social Media)కు దూరం అవుతుండటం గమనార్హం. ఈ నిర్ణయం పట్ల అభిమానులు మిశ్రమ భావోద్వేగాలను వ్యక్తం చేస్తున్నారు. ‘ఘాటి’ ప్రమోషన్లలో పాల్గొన్న అనుష్క, తనకు త్వరలో ఇండస్ట్రీలో 20 ఏళ్లు పూర్తవుతుందని, ఈ సందర్భంగా నెగెటివ్ పాత్ర చేయాలనే కోరికను వెల్లడించారు. ప్రస్తుతం కొత్త కథలు వింటున్నానని, మంచి ప్రాజెక్టులపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తన తొలి మలయాళ సినిమా షూటింగ్ పూర్తవుతోందనీ, అలాగే కొత్త తెలుగు చిత్రం కూడా త్వరలో ప్రకటిస్తామని చెప్పిన ఆమె, సినిమాలకు దూరం కావడం లేదని స్పష్టం చేశారు. విశ్రాంతి కోసం సోషల్ మీడియాకు తాత్కాలికంగా గుడ్‌బై చెప్పిన అనుష్క శెట్టి, అభిమానులని మాత్రం ప్రేమతో ఉండమని చెబుతూ, త్వరలోనే కథలతో, కొత్త పాత్రలతో తిరిగివస్తానని హామీ ఇచ్చారు.
