HomeUncategorizedActress Anushka | అనుష్కతో రానా ఆడియో లీక్.. పెళ్లి ముచ్చ‌ట్ల‌పై క్లారిటీ..!

Actress Anushka | అనుష్కతో రానా ఆడియో లీక్.. పెళ్లి ముచ్చ‌ట్ల‌పై క్లారిటీ..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Actress Anushka | టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి Anushka Shetty గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నాగార్జునతో (Nagarjuna) కలిసి ‘సూపర్’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన అనుష్క.. ‘అరుంధతి’ వంటి సినిమాలతో ఒక్కసారిగా స్టార్‌ స్టేటస్ ద‌క్కించుకుంది.

హీరోయిన్‌గా త‌న‌కంటూ ప్ర‌త్యేక మార్కెట్‌ను ఏర్పరచుకున్న నటి అనుష్క (Actress Anushka) స్టార్ హీరోలతో సమానంగా అభిమానులను సంపాదించుకుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆమె వెండితెరపై తక్కువగా కనిపిస్తోంది. ‘సైజ్ జీరో’ సినిమాతో బరువు పెరిగిన అనంతరం అనుష్క ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెట్టింది. ‘నిశ్శబ్దం’ కోసం బరువు తగ్గి మళ్లీ ఫిట్‌గా మారింది. ఇటీవల నవీన్ పొలిశెట్టితో కలిసి చేసిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ అనే సినిమా చేయ‌గా మంచి విజయం సాధించింది.

Actress Anushka | పెళ్లి ముచ్చ‌ట‌..

ప్రస్తుతం ‘ఘాటి’ (Ghaati) అనే చిత్రంతో మళ్లీ ప్రేక్షకులను పలకరించబోతోంది. ఇక అనుష్క పెళ్లి గురించి అనేక వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఓ దశలో ప్రభాస్‌తో ప్రేమలో ఉందంటూ గాసిప్‌లు చక్కర్లు కొట్టాయి. అయితే వీరిద్దరూ మేము కేవలం మంచి స్నేహితులమే అని స్పష్టత ఇచ్చారు. తర్వాత ఓ ప్రముఖ నిర్మాతను అనుష్క వివాహం చేసుకోబోతుందంటూ కొత్త ఊహాగానాలు తెర‌పైకి వ‌చ్చాయి.తాజాగా అనుష్క పెళ్లి అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. హీరో రానా దగ్గుబాటి తో ఆమె మాట్లాడిన ఓ ఆడియో కాల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ ఆడియో కాల్‌లో (Audio Call) రానాతో మాట్లాడిన‌ అనుష్క, అందరూ నన్ను పెళ్లి గురించి అడుగుతున్నారు అని చెప్పింది. వెంటనే రియాక్ట్ అయిన రానా (Rana), ఏంటి నీ పెళ్లా? అంటూ సరదాగా ప్రశ్నించగా, అనుష్క నవ్వుతూ లేదు లేదు, అలా అంతా అడుగుతున్నారు.. కానీ ఈ ఏడాది చివర్లో పెళ్లి ఉంటుందని అనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది. అనుష్క చెప్పిన‌ ప్రకారం ఈ సంవత్సరం పెళ్లి ఖాయం అనిపిస్తుంది. కానీ ఆమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరో మాత్రం ఇప్పటికీ గుట్టుగా ఉంచింది. ఈ కాల్ వైరల్ కావడంతో మరోసారి ప్రభాస్ (Actor Prabhas) పేరు తెరపైకి వచ్చింది. అభిమానులు మాత్రం అనుష్క-ప్రభాస్ జంటను చూడాలని ఉంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.