అక్షరటుడే, న్యూఢిల్లీ: Anti-Ragging Day : కళాశాలలు ఆగస్టు 12న ర్యాగింగ్ వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించాలని జాతీయ వైద్య కమిషన్ (National Medical Commission) ఆదేశాలు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వైద్య సంస్థలు ఆగస్టు 12ను ర్యాగింగ్ వ్యతిరేక దినోత్సవంగా పాటించాలని జాతీయ వైద్య కమిషన్ (NMC) ఆదేశాల్లో స్పష్టం చేసింది.
దీనికితోడు ఆగస్టు 12 నుంచి 18 వరకు ర్యాగింగ్ వ్యతిరేక వారోత్సవాన్ని నిర్వహించాలని సూచించింది. క్యాంపస్‌లలో ర్యాగింగ్ ఘటనలను అరికట్టే లక్ష్యంతో ఈ కార్యక్రమాల అమలుకు చర్యలు తీసుకుంటోంది.
ఉన్నత విద్యా సంస్థలలో (higher educational institutions – HEIs) సురక్షితమైన, సమగ్ర వాతావరణాన్ని సృష్టించడానికి UGC కఠినమైన ర్యాగింగ్ వ్యతిరేక నిబంధనలు రూపొందించింది. అన్ని అనుబంధ విద్యా సంస్థలు వాటిని అమలు చేయాలని స్పష్టం చేసింది.
ర్యాగింగ్‌ను నిరోధించడానికి UGC విస్తృతమైన మీడియా ప్రచారాలు, అవగాహన కార్యక్రమాలను కూడా చేపడుతోంది. ర్యాగింగ్ వ్యతిరేక చర్యలపై (UGC) వెబ్‌సైట్‌లో వీడియోలు అందుబాటులో ఉన్నాయి. విద్యా సంస్థలు వాటిని ఉపయోగించాలని సిఫార్సు చేసింది.
Anti-Ragging Day : కళాశాలలు నిర్వహించాల్సిన కార్యక్రమాలు ఇవే..
ర్యాగింగ్ రహిత క్యాంపస్ సంస్కృతిపై అవగాహన పెంచడానికి కమిషన్ తీసుకున్న అనేక చర్యలలో యాంటీ-ర్యాగింగ్ డే, వారోత్సవాలు భాగంగా ఉన్నాయి. ఈ యాంటీ ర్యాగింగ్ డే, వారోత్సవాల్లో కళాశాలలు నిర్వహించాల్సిన కార్యక్రమాలను కమిషన్ వివరించింది. అవేమిటి అంటే..
- ర్యాగింగ్ వ్యతిరేక దినోత్సవం, వారోత్సవాల ప్రారంభోత్సవాలు.
- నినాదాల రచన (anti-ragging themes), వ్యాస రచన, పోస్టర్ తయారీ, లోగో రూపకల్పన, వీధి నాటకాలు, ఫొటోగ్రఫీ పోటీలు, క్విజ్‌లు,
- ర్యాగింగ్ వ్యతిరేక ఇతివృత్తాలపై చర్చల వంటి సృజనాత్మక పోటీలు.
- ర్యాగింగ్ వ్యతిరేక సందేశాలను చురుకుగా ప్రోత్సహించే, పాల్గొనేవారిని గుర్తించి సర్టిఫికెట్లు, బహుమతుల పంపిణీ.
- విద్యా సంస్థ అధిపతుల వీడియో సందేశాలు, సంస్థాగత వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్‌లతో సహా ప్రచారాలు.
- వర్క్‌షాప్‌లు workshops, సెమినార్లు seminars, ఇంటరాక్టివ్ సెషన్‌లు, కీలక సందేశాలను వ్యాప్తి చేయడానికి సెల్ఫీ కార్నర్‌ల వంటి సృజనాత్మక ఇన్‌స్టాలేషన్‌ల వంటి అవగాహన కార్యక్రమాలు.
Anti-Ragging Day : జాతీయస్థాయిలో పోటీలు..
డిజిటల్ పోస్టర్‌లు, రీల్స్, చిన్న వీడియోలపై జాతీయ స్థాయి పోటీ 2025లో విద్యార్థుల భాగస్వామ్యం కోరుతోంది కమిషన్. అర్హత, గడువు, ఎంపిక ప్రక్రియ, అవార్డులతో సహా జాతీయ పోటీకి సంబంధించిన సమాచారం antiragging.inలో అందుబాటులో ఉందని సూచిస్తోంది.