ePaper
More
    HomeజాతీయంSpying for Pak | పాక్​ గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్​ అరెస్ట్​

    Spying for Pak | పాక్​ గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్​ అరెస్ట్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Spying for Pak | పాకిస్తాన్​కు గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. పంజాబ్‌లోని మొహాలిలో ఉన్న స్టేట్ స్పెషల్ ఆపరేషన్స్ సెల్ (SSOC) అధికారులు పాక్​కు రహస్య సమాచారం చేరవేస్తున్న జస్బిర్​​ సింగ్​ అనే యూట్యూబర్​(Youtuber)ను తాజాగా అరెస్ట్​ చేశారు. రూప్‌నగర్ జిల్లాలోని మహలాన్ గ్రామానికి చెందిన జస్బీర్ సింగ్ ‘జాన్ మహల్’ అనే యూట్యూబ్ ఛానెల్‌(John Mahal YouTube channel) నిర్వహిస్తున్నాడు.

    Spying for Pak | జ్యోతి మల్హోత్రా

    జస్బీర్ సింగ్ పాకిస్తాన్​(Pakistan)కు రహస్య సమాచారం చేర వేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల అరెస్టయిన జ్యోతి మల్హోత్రా(Jyoti Malhotra)తో జస్బీర్​కు సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. అంతేగాకుండా భారత్​లోని పాకిస్తాన్ హైకమిషన్ నుంచి బహిష్కరించబడిన ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్‌(Danish) సింగ్​తో కూడా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.

    Spying for Pak | మూడు సార్లు పాక్​కు..

    జస్బీర్​ సింగ్​ 2020, 2021, 2024లో మూడుసార్లు పాకిస్తాన్‌కు వెళ్లి వచ్చాడని అధికారులు తెలిపారు. అయితే ఇటీవల జ్యోతి మల్హోత్రా అరెస్ట్​ తర్వాత జస్బీర్​ తన యూట్యూబ్​ ఛానెల్​లోని పాత వీడియోలను డిలీట్​ చేశాడు. తన ఫోన్​లోని పలు కాంటాక్ట్​లను కూడా తొలగించినట్లు అధికారులు గుర్తించారు. అయితే పాక్​వెళ్లి జస్బీర్​ ఏం చేశాడు.. అతని ఫోన్​లో ఎవరెవరితో సంప్రదింపులు జరిపాడని పోలీసులు(Police) ఆరా తీస్తున్నారు. నిందితుడి ఫోన్​ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫోరెన్సిక్​ ల్యాబ్​కు పంపారు.

    Spying for Pak | ఇంకెంత మంది ఉన్నారో..

    జమ్మూ కశ్మీర్​లోని పహల్గామ్​లో ఏప్రిల్​ 22న ఉగ్రవాదులు దాడి(Terrorist Attack) చేశారు. దీనికి ప్రతీకారంగా భారత్​ ఆపరేషన్​ సిందూర్(Operation Sindoor)​ చేపట్టి పాక్​, పీవోకేలోని తొమ్మిది ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ ఘటనలో దాదాపు వంద మంది ఉగ్రవాదులు మరణించారు. అనంతరం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. అయితే ఇరుదేశాల డీజీఎంవోలు చర్చించి కాల్పుల విరణమకు అంగీకరించారు. ఈ క్రమంలో భారత నిఘా వర్గాలు దేశంలో ఉంటూ పాక్​కు సాయం చేస్తున్న వారి ఆట కట్టిస్తున్నాయి. పాక్​కు రహస్య సమాచారం చేరవేస్తున్న వారి వివరాలను పోలీసులకు అందిస్తుండటంతో వారు అరెస్ట్​ చేస్తున్నారు.

    Spying for Pak | డబ్బుల కోసం..

    ఓ వైపు సైనికులు(Soldiers) తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని కాపాడుతున్నారు. కానీ కొందరు మాత్రం డబ్బుల కోసం దేశ భద్రతను పణంగా పెడుతున్నారు. పాకిస్తాన్​ ఇచ్చే డబ్బులకు ఆశపడి ఐఎస్​ఐ ఏజెంట్ల(ISI Agents)తో కుమ్మక్కై భారత రహస్యాలను వారికి చేరవేస్తున్నారు. ఇటీవల ఇలాంటి వారిని పోలీసులు అరెస్ట్​ చేస్తున్నారు. అయితే ఇంకా ఎంతమంది ఇలాంటి వారు ఉన్నారోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పాక్​కు గూఢచర్యం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

    More like this

    Ex Mla Jajala Surendar | రైతులను ఆదుకోకుంటే బీసీ సభను అడ్డుకుంటాం

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Ex Mla Jajala Surendar | ఇటీవలి భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని...

    Chakali Ailamma | పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ సేవలు మరువలేం..

    అక్షరటుడే, ఇందూరు: Chakali Ailamma | నగరంలోని బోర్గాం(పి) చౌరస్తా వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం...

    Kamareddy | గొర్ల మందను ఢీకొన్న లారీ.. గొర్ల కాపరితో సహా 30 గొర్లు మృతి

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | అతివేగంగా వస్తున్న లారీ గొర్ల మందపైకి దూసుకెళ్లగా గొర్ల కాపరితో పాటు 30...