అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vande Bharat Train | మహారాష్ట్రలో (Maharashtra) మరో వందేభారత్ రైలు పట్టాలెక్కనుంది.
దేశంలోనే అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే ఈ రైలు ఆదివారం నుంచి అందుబాటులోకి రానుంది. నాగ్‌పూర్‌లోని అజ్ని పూణే మధ్య నడువనున్న ఈ కొత్త సెమీ-హై-స్పీడ్ రైలును (semi-high-speed train) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఆగస్టు 10న ప్రారంభిస్తారు. ఇది మహారాష్ట్రలో నడువనున్న 12వ వందే భారత్ రైలు అవుతుంది.
Vande Bharat Train | 881 కిలోమీటర్ల ప్రయాణం..
పూణే-అజ్ని-పుణే వందే భారత్ రైలు (26101/26102) 881 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. ఇది భారతదేశంలో అత్యంత ఎక్కువ కాలం నడిచే రైలుగా ఇది నిలువనుంది. గంటకు సగటున 73 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ రైలుకు 10 స్టాప్‌లు ఉంటాయి. ఇది నాగ్‌పూర్ – పూణే (Nagpur – Pune) మధ్య అత్యంత వేగవంతమైన రైలుగా కూడా నిలువనుంది. ఆగస్టు 11 నుంచి ప్రారంభం కానున్న ఈ రైలు వారానికి ఆరు రోజులు నడుస్తుంది.
Vande Bharat Train | రాష్ట్రమంతా కవర్ అయ్యేలా..
ప్రయాణికులు రాష్ట్రంలోని ఒక మూల నుంచి మరొక మూలకు సులభంగా ప్రయాణించగలిగేలా ఈ రైలు ఒక పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది. అంతేకాకుండా, క్రమం తప్పకుండా ప్రయాణించే వ్యాపారవేత్తలు, విద్యార్థులు, ఉద్యోగులకు (students and employees) ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
వార్ధా, బద్నేరా, అకోలా, షెగావ్, భూసావల్, జల్గావ్, మన్మాడ్, కోపర్గావ్, అహ్మద్ నగర్ మరియు దౌండ్ కార్డ్ లైన్ వంటి కీలక స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. మొత్తం ఎనిమిది కోచ్‌లతో నడిచే ఈ వందే భారత్‌లో ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ (EC), ఏడు స్టాండర్డ్ చైర్ కార్లు (CC) ఉండగా, 590 సీటింగ్ కెపాసిటీ కలిగి ఉంది.