HomeUncategorizedPhone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్..

Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Phone Tapping Case | తెలంగాణ(Telangana)లో సంచలనం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బీఆర్​ఎస్​ హయాంలో రాష్ట్రంలోని ప్రతిపక్ష నాయకులతో పాటు జడ్జీలు, సినీ ప్రముఖులు, వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్​(Phone Tapping)కు గురయ్యాయని ప్రభుత్వం కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ కోసం సిట్​ను కూడా ఏర్పాటు చేసింది. సిట్​ అధికారులు(Sit Officers) ప్రస్తుతం ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్​ఐబీ మాజీ చీఫ్​ ప్రభాకర్​రావు(Former SIB chief Prabhakar Rao)ను విచారిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్​ ఏపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.

తన ఫోన్లు కూడా ట్యాప్​ చేశారని షర్మిల(Congress AP President YS Sharmila) ఆరోపించారు. ఎన్నికలకు ముందు షర్మిల వైఎస్​ఆర్​ టీపీ పార్టీ పెట్టి తెలంగాణలో పలు కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్​(Hyderabad)లోనే తన ఫోన్లు ట్యాప్ చేశారంటూ షర్మిల ఆరోపణలు చేశారు. తను ఎవరెవరితో మాట్లాడుతున్నారన్నది ఎప్పటికప్పుడు జగన్​(YS Jagan)కు చేరవేశారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.మరోవైపు షర్మిల ఫోన్​ ట్యాప్​ చేసి ప్రభాకర్​రావు టీమ్​ కోడ్ లాంగ్వేజ్(Team code language) వాడినట్లు సమాచారం. ట్యాపింగ్ చేస్తున్నట్లు గుర్తించి వ్యక్తిగత ఫోన్లను మార్చినట్లు ఆమె తెలిపారు.

Must Read
Related News