Homeతాజావార్తలుNalgonda | మరో ట్రావెల్స్​ బస్సు దగ్ధం.. తప్పిన ప్రమాదం

Nalgonda | మరో ట్రావెల్స్​ బస్సు దగ్ధం.. తప్పిన ప్రమాదం

మరో ప్రైవేట్​ ట్రావెల్స్​ బస్సు దగ్ధమైంది. విజయవాడ-హైదరాబాద్ హైవేపై నల్గొండ జిల్లా పిట్టంపల్లి వద్ద బస్సులో మంటలు చెలరేగాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nalgonda | కర్నూల్​ జిల్లాలో ఇటీవల ప్రైవేట్ ట్రావెల్స్​ బస్సు దగ్ధమై 19 మంది సజీవ దహనం అయిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే మరో ట్రావెల్స్​ బస్సు కాలిపోయింది. ఈ ఘటన నల్గొండ జిల్లా (Nalgonda District)లో చోటు చేసుకుంది.

విహారి ట్రావెల్స్​కు చెందిన బస్సు హైద‌రాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుండగా.. ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ-హైదరాబాద్ హైవేపై నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి వద్ద బస్సులో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్​ వెంటనే బస్సును పక్కకు ఆపాడు. దీంతో ప్రయాణికులు అద్దాలు పగులకొట్టుకొని కిందకు దూకారు. అనంతరం బస్సు పూర్తిగా కాలిపోయింది. ఘటన సమయంలో బస్సులో మొత్తం 29 మంది ప్రయాణికులు ఉన్నారు.

Nalgonda | టీ బ్రేక్​ ఆగిన కాసేపటికే..

డ్రైవర్​ బస్సును టీ బ్రేక్​ కోసం చౌటుప్పల్​ (Choutuppal​) వద్ద ఆపాడు. అనంతరం బస్సు బయలు దేరిన పది నిమిషాలకే ఇంజిన్​లో మంటలు రావడాన్ని డ్రైవర్​ గమనించాడు. వెంటనే ప్రయాణికులకు సమాచారం ఇచ్చి బస్సును ఆపాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఏ మాత్రం ఆలస్యం అయినా భారీ ప్రాణనష్టం జరిగేది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజిన్లు (Fire Engines) ఘటన స్థలానికి చేరుకున్నాయి. అయితే అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది.

Nalgonda | ప్రయాణికుల ఆందోళన

ఇటీవల బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్​ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్​కు చెందిన బస్సు దగ్ధమై 19 మంది మృతి చెందిన విషయం తెలిసింది. చెవేళ్ల వద్ద ఆర్టీసీ బస్సును కంకర లోడ్​తో వెళ్తున్న లారీ ఢీకొనడంతో 19 మంది చనిపోయారు. ఇటీవల పలు ట్రావెల్స్​ బస్సులు ప్రమాదాలకు గురి అవుతున్నాయి. దీంతో బస్సు ఎక్కాలంటే ప్రయాణికులు భయపడుతున్నారు.

Must Read
Related News