అక్షరటుడే, సినిమాడెస్క్: Raja Saab New Trailer | రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas)‘రాజాసాబ్’ నుంచి మరో ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ‘ది రాజాసాబ్ ట్రైలర్ 2.0’గా చిత్ర యూనిట్ దీనిని విడుదల చేసింది. కాగా.. గత రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో (Hyderabad) నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే రిలీజ్ చేస్తారని ప్రభాస్ ఫ్యాన్ భావించారు. కానీ ఆదికాస్త ఆలస్యమైంది. దీంతో నేడు విడుదల చేశారు. గతంలో వచ్చి ట్రైలర్‌కు దీటుగా ఉంది. కామెడీ, హారర్ లాంటి ఎమోషన్స్ బాగా చూపించారు.
Raja Saab New Trailer | అదుర్స్ అనిపించిన ట్రైలర్
తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ అదుర్స్ అనిపిస్తోంది. విడుదల చేసిన నిమిషాల్లోనే ట్రైలర్ వైరల్‌గా మారింద. ఇందులో ప్రభాస్ అదరగొట్టారంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ప్రభాస్ సరసన మాళవిక, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. అలాగే సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. చిత్రాన్ని డైరెక్టర్ మారుతి (Director Maruthi) తెరకెక్కించారు. తమన్ సంగీతం అందించాడు.
Raja Saab New Trailer | జనవరి 9న ప్రేక్షకుల ముందుకు..
‘రాజాసాబ్’ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచ వ్యాప్తంగా వేల థియేటర్లలో రిలీజ్ కానుంది. కాగా.. 8వ తేదీన రాత్రి ప్రీమియర్ షోలు కూడా వేయనున్నారు. అయితే ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే ప్రీమియర్లు, టికెట్ రేట్ల (Ticket Prices) గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. లేదంటే 8వ తేదీ సెకండ్ షోల నుంచి సినిమా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
