అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jammu Kashmir |భారత్ – పాక్ మధ్య దాడులు తీవ్రతరం అయ్యాయి. పాకిస్తాన్ ఎల్వోసీ LOC వెంబడి విచక్షణరహితంగా కాల్పులు జరుపుతోంది.
కాగా.. పాక్ కాల్పుల్లో మరో జవాన్ వీర మరణం పొందారు. జమ్మూలో పాక్ జరిపిన కాల్పుల్లో సచిన్ యాదవ్‌రావు వనాంజే(29) అనే జవాన్ మృతి చెందాడు. మహారాష్ట్రలోని నాందేడ్ maharashtra state జిల్లా nanded district తమ్లూర్ గ్రామానికి చెందిన యాదవ్‌రావు పాక్ జరిపిన దాడుల్లో నేలకొరిగాడు. ఆయన మృతదేహం శనివారం స్వగ్రామానికి చేరుకుంది. కాగా ఏపీలోని సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ కూడా పాక్ కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు పాక్ దాడులను భారత దళాలు తిప్పి కొడుతున్నాయి.