ePaper
More
    Homeటెక్నాలజీOne Plus | వన్​ ప్లస్​ నుంచి మరో స్మార్ట్​ ఫోన్​.. ఆకట్టుకుంటున్న 13 ఎస్...

    One Plus | వన్​ ప్లస్​ నుంచి మరో స్మార్ట్​ ఫోన్​.. ఆకట్టుకుంటున్న 13 ఎస్ మోడల్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:One Plus | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్(One Plus) మరో అధునాతన ఫోన్​ను త్వరలోనే మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఎన్నో విజయవంతమైన ఫోన్లను అందుబాటులోకి తెచ్చిన ఈ మొబైల్ తయారీ సంస్థ చేతిలో ఇమిడిపోయే వన్​ప్లస్​ 13 ఎస్ కాంపాక్ట్ ఫోన్​ను విడుదల చేయనుంది.

    ఇప్పటికే చైనా మార్కెట్లో ఎంట్రీ ఇచ్చిన వన్ ప్లస్ 13టీ పేరిట ఈ స్మార్ట్​ఫోన్​(Smart Phone) వినియోగదారులను ఎంతో ఆకట్టుకుంది. త్వరలోనే మన మార్కెట్లోకి రానున్న వన్ ప్లస్ 13 ఎస్​గా రానుంది. 6.32 అంగుళాల డిస్​ప్లే(Display), డ్యూయల్ కెమెరా(Dual camera)తో లాంచ్ చేయనుంది. కంపెనీ విడుదల చేసిన ఇమేజ్​ను చూసి చాలా మంది ఫిదా అయ్యారు. కాంపాక్ట్ సైజులో, గత మోడళ్లకు భిన్నంగా ఈ ఫోన్ ఉండడం విశేషంగా ఆకట్టుకుంటోంది.

    One Plus | అధునాతన ఫీచర్లు..

    వన్ ప్లస్ 13ఎస్ మోడల్లో అధునాతన ఫీచర్లు అందుబాటులో ఉండనున్నాయి. తాజా స్నాప్​డ్రాగన్ (Snapdragon)​ 8 ఎలైట్ చిప్​సెట్​తో రూపొందించిన ఈ ఫోన్ వేగంగా పని చేస్తుంది. డిస్ ప్లే 120Hz రిఫ్రెష్ రేట్. 1600 నిట్స్ పీక్ బ్రైట్​నెస్​తో పాటు సిరామిక్ గార్డ్​(Ceramic guard)తో 6.32 అంగుళాల 1.5K 8T LTPO AMOLED డిస్​ప్లేతో వస్తుంది.. బరువు దాదాపు 185 గ్రాములు.. ఇది హై-స్పీడ్ ప్రాసెసర్​తో పాటు, Adreno 830 GPU ఉంది. ఇది 12/16GB LPDDR5X RAM, 1TB వరకు UFS 4.0 స్టోరేజ్ చేసుకోవచ్చు.

    One Plus | ధర రూ.40 వేలలోపే

    వన్ ప్లస్ 13ఎస్ మోడల్ ధర గరిష్టంగా రూ.40 వేల లోపే అందుబాటులోకి రానుంది. ఇటీవల చైనా మార్కెట్లోకి ప్రవేశించిన 12 జీబీ రామ్ +256 జీబీ స్టోరేజీతో వన్ ప్లస్ 13టీ సిరీస్ మాడల్ ధర 3,999 యువాన్లు. అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.39,668 అన్నమాట. భారత్లో కాస్త అటుఇటుగా ఇదే ధరలో అందుబాటులో ఉండనుంది. వన్ ప్లస్ 13 ఎస్ ఫోన్ కెమెరా OISతో 50mp Sony IMX906 ప్రైమరీ షూటర్, OISకి మద్దతు ఇచ్చే 50mp 2x టెలిఫోటో లెన్స్​తో సహా డ్యూయల్-కెమెరా(Dual Camera) సెటప్తో వస్తుంది. 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా(Front Camera) 30fps నాణ్యతతో 1080p వరకు వీడియోలను రికార్డ్(Record videos) చేయగలదు. ఇక ఇందులో ఉన్న 6,260mAh బ్యాటరీ అత్యధిక బ్యాకప్ ఇస్తుంది. అలర్ట్ స్లయిడర్ స్థానంలో కొత్తగా షార్ట్ కీని ప్రవేశపెట్టారు. బ్లాక్ వెల్వెట్(Black velvet), పింక్ శాటిన్(Pink satin). రంగుల్లో రానున్న ఈ ఫోన్ విక్రయాలు అమెజాన్ (Amazon) వేదికగా త్వరలోనే ప్రారంభం కానున్నాయి.

    More like this

    Chhattisgarh | చత్తీస్గ‌ఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. కీలక నేత సహా పది మంది హతం.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chhattisgarh | చత్తీస్గ‌ఢ్‌లో గురువారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు...

    Bodhan | విద్యుత్​స్తంభాలు తీసుకెళ్తుండగా ట్రాక్టర్​ బోల్తా.. ఇద్దరి మృతి

    అక్షరటుడే, బోధన్: Bodhan | విద్యుత్​ స్తంభాలు మీదపడి ఇద్దరు జీపీ సిబ్బంది మృతి చెందారు. ఈ ఘటన...

    Rahul Gandhi | సెక్యూరిటీ ప్రొటోకాల్ ఉల్లంఘించిన రాహుల్.. కాంగ్రెస్ నేతపై మండిపడ్డ బీజేపీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తన...