అక్షరటుడే, వెబ్‌డెస్క్: US Government | అమెరికాలో ఫెడరల్ ప్రభుత్వం (US federal government) మరోసారి పాక్షిక షట్‌డౌన్ అయ్యింది. 2026 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఆమోదం కోసం నిర్ణయించిన గడువు అర్ధరాత్రి ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు పాక్షికంగా స్తంభించాయి. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా (International media) శనివారం వెల్లడించింది.
US Government | మినియాపొలిస్ ఘటనే కారణమా..!
అమెరికాలోని మినియాపొలిస్ నగరంలో ఇటీవల జరిగిన ఒక దుర్ఘటన ఈ షట్డౌన్కు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) (Immigration and Customs Enforcement) అధికారుల కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సెనెట్‌లోని డెమోక్రాటిక్ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
“చట్టాన్ని అమలు చేసే అధికారులకు, సరిహద్దు భద్రతా బృందాలకు అమెరికా ప్రజలు ఎల్లవేళలా మద్దతు ఇస్తారు. కానీ వీధుల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, అమెరికా పౌరుల ప్రాణాలను హరించే ఐసీఈ చర్యలను సహించబోం” అని వారు హెచ్చరించారు. ఐసీఈ విధానాల్లో సంస్కరణలు రాకపోతే నిధుల బిల్లుకు తమ ఓట్లు వేయబోమని స్పష్టం చేశారు. ఫలితంగా హోంలాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్తో పాటు కొన్ని ఇతర విభాగాలకు నిధులు తాత్కాలికంగా నిలిచిపోయాయి.
అయినప్పటికీ ఈ షట్‌డౌన్ పూర్తిస్థాయిలో కాకుండా పాక్షికంగానే ఉంటుందని, వచ్చే వారం నిధుల బిల్లుపై మరింత చర్చలు జరిగే అవకాశం ఉందని చట్టసభ సభ్యులు తెలిపారు.
US Government | గతంలో పలుమార్లు షట్‌డౌన్..
అమెరికాలో ప్రభుత్వం షట్‌డౌన్ కావడం కొత్తమీ కాదు. గతేడాది అక్టోబర్ 1 నుంచి ప్రారంభమైన షట్‌డౌన్ దేశ చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలం (43 రోజులు) పాటు కొనసాగింది. 1981 నుంచి ఇప్పటి వరకు అమెరికా ఫెడరల్ ప్రభుత్వం మొత్తం 16 సార్లు ఇలా షట్డౌన్కు గురైంది. 2018-19 మధ్య కాలంలో 35 రోజుల పాటు షట్‌డౌన్ సాగిన సందర్భంలో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉన్నారు.
షట్‌డౌన్ ప్రారంభమైన తర్వాత ఎంతకాలం సాగుతుందనేది చెప్పలేం. అయితే ఈసారి కూడా పాక్షిక షట్డౌన్గా మొదలైనప్పటికీ, రాజకీయ చర్చలు త్వరలోనే పరిష్కారం కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.