అక్షరటుడే, వెబ్‌డెస్క్ : America | అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.
అమెరికాలోని మిస్సిస్సిప్పి (Mississippi) రాష్ట్రంలో కాల్పులు కలకలం రేపాయి. క్లే కౌంటీలో జరిగిన ఘటనలో ఏడేళ్ల చిన్నారి సహా ఆరుగురు చనిపోయారు. మూడు వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇటీవల అమెరికాలో తరచూ కాల్పులు చోటు చేసుకుంటుండం ఆందోళన కలిగిస్తోంది.
America | వరుస కాల్పులు
అమెరికా కాలమానం ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత మూడు వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి. కాల్పులు జరిపిన వ్యక్తికి బాధితులు బంధువులు కావడం గమనార్హం. నిందితుడిని డారికా ఎం. మూర్‌గా గుర్తించారు. అతను ఫస్ట్-డిగ్రీ హత్య అభియోగాన్ని ఎదుర్కొంటున్నాడు, దీనిని కాపిటల్ మర్డర్‌గా అప్‌గ్రేడ్ చేయవచ్చు అని పోలీసులు పేర్కొన్నారు.
డారికా మూర్ మొదట అనేక మంది కుటుంబ సభ్యులను కాల్చి చంపాడు. అనంతరం మరణించిన తన సోదరుడికి చెందిన ఫోర్డ్ F-150 కారు (Ford Car)ను దొంగిలించాడని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. తరువాత మూర్ బ్లేక్ రోడ్‌కు వెళ్లి, బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి, 7 ఏళ్ల బాలికను కాల్చి చంపడానికి ప్రయత్నించాడు. అనంతరం గ్రిఫిన్ రోడ్‌కు ప్రయాణించి మరొక నివాసంలోకి ప్రవేశించి ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరిపాడు. మిస్సిస్సిప్పి హైవే పెట్రోల్, యూఎస్ మార్షల్స్ (US Marshals), ఇతర ఏజెన్సీలు నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి. అయితే అతడు ఎందుకు కాల్పులు జరిపాడనే వివరాలు తెలియరాలేదు.