Homeఅంతర్జాతీయంAmerica | అమెరికాలో మరోసారి కాల్పులు.. ముగ్గురి మృతి

America | అమెరికాలో మరోసారి కాల్పులు.. ముగ్గురి మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : America | అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. ఓ వ్యక్తి రెస్టారెంట్ (Restaurant)​పై కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.

అమెరికాలోని నార్త్‌ కరోలినా (North Carolina)లో యూఎస్ (US)​ కాలమానం ప్రకారం శనివారం రాత్రి కాల్పులు చోటు చేసుకున్నాయి. రాత్రి 9:30 గంటల ప్రాంతంలో విల్మింగ్టన్‌కు దక్షిణంగా 20 మైళ్ల దూరంలో ఉన్న సౌత్‌పోర్ట్ యాచ్ బేసిన్ ప్రాంతంలోని అమెరికన్ ఫిష్ కంపెనీ రెస్టారెంట్​లో కాల్పులు జరిగాయి. గుర్తు తెలియని వ్యక్తి బోటులో వచ్చి కాల్పులకు పాల్పడ్డాడు. అనంతరం అదే బోటులో పారిపోయాడు. కాగా ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

America | ఏడుగురిపై కాల్పులు

దుండగుడు ఏడుగురిపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా వారిని ఆస్పత్రికి తరలించారు. ఒక పడవ రెస్టారెంట్ వద్దకు వచ్చిన తర్వాత అందులోని వ్యక్తి వేగంగా వెళ్లి జనంపై కాల్పులు జరపడం ప్రారంభించినట్లు నగర మేనేజర్ నోహ్ సాల్డో ధృవీకరించారు. ప్రజలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరిగితే వెంటనే 911 కు ఫోన్​ చేయాలన్నారు.

కాగా ఇటీవల అమెరికాలో కాల్పుల ఘటనలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మూడు రోజుల క్రితం డల్లాస్‌ (Dallas)లోని యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఫీల్డ్ ఆఫీస్ వద్ద కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Must Read
Related News