అక్షరటుడే, వెబ్‌డెస్క్ :America | అగ్రరాజ్యం అమెరికాలో మరో సారి కాల్పులు చోటు చేసుకున్నాయి. నిత్యం కాల్పులు చోటు చేసుకుంటూ ఉండటంతో అమెరికావాసులు (Americans) ఆందోళన చెందుతున్నారు. కనెక్టికట్‌లోని ఓ మాల్‌లో connectycut mall దుండగుడు ఫైరింగ్ చేశాడు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలు కాగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం పోలీసులు(Police) గాలిస్తున్నారు.
కాగా.. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి యూఎస్‌లోని ఫిలడెల్ఫియా(Philadelphia)లోని ఓ పార్క్‌లో కాల్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సోమవారం మెమోరియల్ డే united states memorial day సందర్భంగా రద్దీ అధికంగా ఉన్న ప్రాంతంలో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఎనిమిది మంది గాయపడ్డారు.
ఆదివారం సౌత్ కరోలినా(South Carolina)లో కాల్పులు చోటుచేసుకోగా 11 మంది గాయపడ్డారు. అగ్రరాజ్యం అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటుడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో భద్రత బాగుంటుందని ఎక్కువ మంది భావిస్తుంటారు. కానీ అలాంటి దేశంలోనే నిత్యం ఏదో ఒక ప్రాంతంలో దుండగులు తుపాకులతో ఫైరింగ్(Firing) చేస్తున్నారు.
ఈ ఘటనల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది గాయపడ్డారు. ముఖ్యంగా అమెరికాలో ఎక్కువ మంది దగ్గర తుపాకులు(Guns) ఉండటం కాల్పులకు కారణంగా భావిస్తారు. అమెరికా జనాభా కంటే వారి వద్ద ఉన్న తుపాకుల సంఖ్య ఎక్కువనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు దొరికితే వారు ఇష్టం వచ్చినట్లు కాల్పులకు తెగబడుతున్నారు. అమెరికాలో కాల్పుల ఘటనలతో దేశంలోని పలువురు ఆందోళన చెందుతున్నారు. భారత విద్యార్థులు(Indian Students) ఎంతో మంది చదువు, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ తుపాకుల మోత గురించి వార్తలు వచ్చిన ప్రతిసారీ వారి తల్లిదండ్రులు ఇక్కడ ఆందోళన చెందుతున్నారు. ఆ దేశంలో తమ పిల్లలు ఎలా ఉన్నారోనని భయపడుతున్నారు.