అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Pakistan | ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ pakistanకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి pahalgam terror attack తర్వాత భారత్ పాకిస్తాన్‌కు సింధూ నదీ జలాలను sindhu river water ఆపేసిన విషయం తెలిసిందే. తాజాగా అఫ్గానిస్తాన్ afganistan సైతం పాక్‌కు నీరు వెళ్లకుండా అడ్డుకట్ట వేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్‌తో వాణిజ్యంతో పాటు పలు ఒప్పందాలను రద్దు చేసుకుంది. పాకిస్తాన్ సాగు, తాగు నీరుకు ప్రధాన వనరైన సింధూ నది జలాలకు ఆపేసింది. దీంతో పాక్ నీటి ఎద్దడి ఎదుర్కొంటుంది. తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నామని, సింధూ నది జలాలు విడుదల చేయాలని ఆ దేశం ఇటీవల భారత్‌కు లేఖ కూడా రాసింది.
Pakistan | డ్యామ్‌ల నిర్మాణానికి అఫ్గాన్ చర్యలు
పాకిస్తాన్‌కు నీటి ప్రవాహాన్ని తగ్గించడానికి ఆనకట్టలు నిర్మించాలని అఫ్గానిస్తాన్ యోచిస్తోంది. పాకిస్తాన్‌లోకి ప్రవహించే నీటిని నిలుపుకోవడానికి ఆనకట్టలు dam నిర్మించాలని తాలిబాన్ జనరల్ taliban general ముబిన్ కాబూల్ ప్రభుత్వాన్ని కోరినట్లు మీర్ యాబ్ బలోచ్ వెల్లడించారు. కాబూల్ నది kavul riverకి ఉపనది అయిన కునార్ నది kunar river అఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్‌లోకి ప్రవహిస్తోంది.
ఇది పాక్ నీటి అవసరాలను ఎంతగానో తీరుస్తుంది. దీంతో ఈ నదిపై డ్యామ్ నిర్మించి నీటిని మళ్లించుకోవాలని ఆ దేశం చూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, పేదరికంతో ఇబ్బందులు పడుతున్న పాక్ రానున్న రోజుల్లో నీటి కొరతతో మరిన్ని కష్టాలు ఎదుర్కోనుంది.