HomeUncategorizedPakistan | పాకిస్తాన్​కు మరో షాక్​.. ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న బీఎల్​ఏ

Pakistan | పాకిస్తాన్​కు మరో షాక్​.. ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న బీఎల్​ఏ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Pakistan | ఓ వైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు భారత్​ bharatతో యుద్ధ భయంతో ఉన్న పాకిస్తాన్ pakistan​కు మరో షాక్​ తగిలింది. బలూచిస్తాన్(​Balochistan)పై ఆ దేశం పట్టు కోల్పోతోంది. బలూచిస్తాన్‌ను ప్రత్యేకదేశంగా ప్రకటించాలని డిమాండ్​తో బలూచ్​ లిబరేషన్​ ఆర్మీ(BLA) కొంతకాలంగా దాడులు చేస్తోంది. ముఖ్యంగా పాక్​ సైనికులే pak army లక్ష్యంగా ఈ సంస్థ దాడులకు తెగబడుతోంది. ఇప్పటికే బీఎల్​ఏ దాడుల్లో వందలాది మంది పాక్​ సైనికులు మృతి చెందారు. తాజాగా బీఎల్ఏ బలూచిస్తాన్​లోని మంగుచోర్‌(Mangocher) పట్టణాన్ని ఆధీనంలోకి తీసుకుంది. పాక్‌ సైనికులను బంధించి పట్టాణాన్ని స్వాధీనం చేసుకోవడం గమనార్హం. సొంత దేశంతో నిరసనకారుల నుంచి పట్టణాన్ని కాపాడుకోలేక పోయిన పాక్​.. భారత్​పై మాత్రం దాడులకు వెనుకాడబోం అంటూ ప్రకటనలు చేస్తుండడం గమనార్హం.