ePaper
More
    HomeజాతీయంEncounter | మావోయిస్టులకు మరో షాక్​.. ఎన్​కౌంటర్​లో నలుగురి మృతి

    Encounter | మావోయిస్టులకు మరో షాక్​.. ఎన్​కౌంటర్​లో నలుగురి మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Encounter | మావోయిస్టులకు మరో షాక్​ తగిలింది. కొద్ది రోజుల క్రితం ఛత్తీస్​గఢ్ (Chhattisgarh)​లో వరుస ఎన్​కౌంటర్లలో పదుల సంఖ్యలో మావోయిస్టులు (Maoists) మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందులో కీలక నేతలు సైతం హతమయ్యారు. తాజాగా మధ్యప్రదేశ్​ (Madhya Pradesh)లో జరిగిన ఎన్​కౌంటర్​లో నలుగురు నక్సల్స్​ చనిపోయారు. ఇందులో ముగ్గురు మహిళలు ఉండటం గమనార్హం.

    మధ్యప్రదేశ్​లోని బాలాఘాట్ జిల్లాలోని అడవుల్లో శనివారం భద్రతా బలగాలు, పోలీసులు కూంబింగ్​ చేపట్టారు. మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు పెద్ద సంఖ్యలో బలగాలు సెర్చ్​ ఆపరేషన్​ (Search Operation)లో పాల్గొన్నాయి. ఈ క్రమంలో పచ్మదార్, కటేజిరియా అటవీ ప్రాంతాలలో ఎన్‌కౌంటర్ (Encounter) చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మావోల కోసం ఇంకా సెర్చ్​ ఆపరేషన్​ కొనసాగుతూనే ఉంది.

    Encounter | బలగాలను అభినందించిన సీఎం

    మధ్యప్రదేశ్​లో జరిగిన ఎన్​కౌంటర్​ ఆ రాష్ట్ర సీఎం మోహన్​ యాదవ్​ (CM Mohan Yadav) ఎక్స్​ వేదికగా స్పందించారు. దేశంలో 2026 మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేయాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో మధ్యప్రదేశ్​ ఒక మైలు రాయి అని అన్నారు. ఈ ఆపరేషన్​ విజయవంతం అయిందని ప్రకటించారు. ఘటన స్థలంలో గ్రెనేడ్ లాంచర్, సెల్ఫ్-లోడింగ్ రైఫిల్ (SLR), రెండు 315 బోర్ రైఫిల్స్, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్​లో పాల్గొన్న జవాన్లు, పోలీసు అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు. భద్రతా దళాల ధైర్యం, నిబద్ధతను సీఎం యాదవ్ ప్రశంసించారు.

    Encounter | కీలక నేతలు హతం

    ఇటీవల జరిగిన ఎన్​కౌంటర్లలో మావోయిస్ట్​ కీలక నేతలు హతం అయ్యారు. ఓ వైపు క్యాడర్​, మరోవైపు అగ్రనేతలను కోల్పోతుండటంతో మావోయిస్టులు ఆందోళన చెందుతున్నారు. నంబాల కేశవరావు, సుధాకర్​, భాస్కర్​ లాంటి కీలక నేతలు ఇటీవల మరణించారు. ఈ క్రమంలో తమ ఉనికి చాటుకోవడానికి మావోలు దాడులకు పాల్పడుతున్నారు.

    ఇందులో భాగంగా ఇటీవల ఛత్తీస్​గఢ్​లోని మావోయిస్ట్​ అగ్రనేత హిడ్మా స్వగ్రామంలో ఓ వ్యక్తిని ఇన్​ఫార్మర్​ నెపంతో హత్య చేశారు. అంతేగాకుండా ఓ ట్రక్కును సైతం కాలబెట్టారు. అనంతరం కూంబింగ్​కు వెళ్తున్న పోలీస్​ వాహనాన్ని ఐఈడీతో పేల్చివేశారు. ఛత్తీస్​గఢ్​ సుక్మా (sukma) జిల్లాలో ఈ పోలీస్​ వాహనాన్ని మావోలు పేల్చేయగా ఏఎస్పీ ఆకాశ్​రావు మృతి చెందారు. పలువురు సిబ్బంది గాయపడ్డారు. మొన్నటి వరకు శాంతి చర్చలకు సిద్ధమని చెప్పిన మావోలు తాజాగా పంథా మార్చి దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలో మళ్లీ ఎన్​కౌంటర్​లో నలుగురు మావోయిస్టులు మృతి చెందడం గమనార్హం.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...