ePaper
More
    HomeజాతీయంEncounter | మావోయిస్టులకు మరో షాక్​.. గడ్చిరోలి జిల్లాలో ఎన్​కౌంటర్​

    Encounter | మావోయిస్టులకు మరో షాక్​.. గడ్చిరోలి జిల్లాలో ఎన్​కౌంటర్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Encounter | మావోయిస్టులకు మరో షాక్ తగిలింది. ఇటీవల ఛత్తీస్​గఢ్​లోని నారాయణపూర్​ జిల్లాలో (Narayanpur district) జరిగిన ఎన్​కౌంటర్​లో 27 మంది మావోలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందులో మావోయిస్టులు కీలక నేత నంబాల కేశవరావుతో సహా పలువురు అగ్రనేతలు మృతి చెందారు. తాజాగా మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో (Maharashtra Gadchiroli district) మరో ఎన్‌కౌంటర్‌ జరిగింది. మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో (Maharashtra-Chhattisgarh border) శుక్రవారం ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. వారి నుంచి బలగాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టుల (Maoists) కోసం బలగాలు కూంబింగ్​ చేపడుతున్నాయి.

    వరుస ఎన్​కౌంటర్లతో మావోయిస్టులు కోలుకోలేక పోతున్నారు. దేశంలో నక్సలిజాన్ని (Naxalism) నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్​ కగార్​ (Operation Kagar) చేపట్టింది. ఈ క్రమంలో అడవులను జల్లెడ పడుతున్నారు. దీంతో తమకు గతంలో పట్టున్న అడవుల్లో కూడా మావోయిస్టులు ప్రాబల్యం కోల్పోతున్నారు. మావోయిస్టులకు (Maoists) పెట్టని కోటగా ఉన్న దండకారణ్యాన్ని సైతం బలగాలు జల్లెడ పట్టడంతో మావోలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.

    దీంతో పాటు నిత్యం ఎన్​కౌంటర్లు జరగడం, కీలక నేతలు హతం అవుతుండడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆపరేషన్​ కగార్​ (Operation Kagar) ఆపాలని, తాము చర్చలకు సిద్ధమని వారు ప్రకటించారు. అయితే ప్రభుత్వం (governament) మాత్రం చర్చలపై ఎలాంటి ప్రకటన చేయడం లేదు. మావోస్టులు తుపాకులు వదిలి లొంగిపోవాలని ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్​ షా వ్యాఖ్యానించారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...