అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Maoists Surrender | ఆపరేషన్ కగార్(Operation Kagar)తో మావోయిస్టులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిత్యం ఎన్కౌంటర్లు(Encounters) చోటు చేసుకుంటూ ఉండటంతో భారీ సంఖ్యలో మావోలు మృతి చెందుతున్నారు. మరోవైపు కీలక నేతలు సైతం హతం అవుతుండటంతో మావోయిస్ట్ ఉద్యమం క్రమంగా బలహీనం అవుతోంది. దీనికి తోడు లొంగుబాట్లు మావోయిస్టు(Maoist)లను కలవరపెడుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్‌రాజ్ (SP Rohitraj Raj) ఎదుట శుక్రవారం 17 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. కాగా.. గురువారం పోలీసులు మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్(Hidma Arrest) చేసిన విషయం తెలిసిందే. ఒడిశాలోని కోరాపూట్ జిల్లాలో హిడ్మాను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టుల కమాండర్ నంబాల కేశవరావు(Commander Nambala Kesava Rao) సహా పలువురు కీలక నేతలు హతమయ్యారు. ఓ వైపు ఎన్కౌంటర్లు, మరోవైపు లొంగుబాట్లతో మావోయిస్టులు ఆందోళన చెందుతున్నారు.
దేశంలో 2026 మార్చి వరకు మావోయిస్టులు(Maoists) లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) స్వయంగా పార్లమెంట్లో ప్రకటించారు. ఈ మేరకు ఆపరేషన్ కగార్ చేపట్టి మావోలకు పట్టున్న అడువుల్లో సైతం వారిని ఎన్కౌంటర్ చేస్తున్నారు. వరుస ఎన్కౌంటర్లతో కలవర పడుతున్న మావోయిస్టులు ఇదివరకే తాము శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ఆపరేషన్ కగార్ ఆపాలని, కేంద్ర ప్రభుత్వం(Central Government) తాము చర్చలకు సిద్ధమని తెలిపారు. ప్రజా సంఘాల నాయకులు సైతం ఆపరేషన్ కగార్ ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కేంద్రం మాత్రం మావోలపై పోరు కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలో పలువురు మావోయిస్టులు ఉద్యమ బాట వీడి లొంగిపోతున్నారు.