అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Maoists | మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో ఆదివారం 21 మంది లొంగిపోయారు.
వరుస లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ బలహీనం అవుతోంది. ఆపరేషన్ కగార్ (Operation Kagar) దెబ్బకు ఇప్పటికే చాలా మంది కీలక నేతలు ఎన్కౌంటర్ల మరణించారు. వందలాది మంది మావోయిస్టులు సైతం చనిపోయారు. ఈ క్రమంలో ఇటీవల మల్లోజుల వేణుగోపాల్‌రావు 61 మందితో లొంగిపోయిన విషయం తెలిసిందే. అనంతరం మరో కీలక నేత ఆశన్న సైతం 210 మందితో సరెండర్ అయ్యారు. తాజాగా వారి బాటలో మరో 21 మంది మావోలు అడవులను వీడారు.
Maoists | ఆయుధాల అప్పగింత
ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ (Kankeru) జిల్లాలో మరో 21 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. కేశ్‌కాల్ డివిజన్ కమిటీ కార్యదర్శి ముకేష్, నలుగురు డివిజన్ వైస్ కమిటీ సభ్యులు, తొమ్మిది మంది ఏఎంసీ ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు. 18 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. అందులో మూడు ఏకే 47 రైఫిల్స్, నాలుగు ఎస్‌ఎల్‌ఆర్‌లు, రెండు ఇన్సాస్ రైఫిల్స్, ఆరు 303 రైఫిల్స్, రెండు సింగిల్ షాట్ రైఫిల్స్, ఒక బీజీఎల్ (బారెల్ గ్రెనేడ్ లాంచర్) ఉంది. వారి పునరావాస వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు.
Maoists | పునరేకీకరణలో భాగంగా..
బస్తర్ రేంజ్ పోలీసులు (Bastar Range Police) ఇటీవల పూనా మార్గెమ్ (పునరేకీకరణ) కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం చొరవతో మావోలు ఆయుధాలు వీడారని పోలీసులు తెలిపారు. అక్టోబర్ 17న బస్తర్ జిల్లాలోని జగదల్‌పూర్‌లో కేంద్ర కమిటీ సభ్యుడు రూపేష్ అలియాస్ ఆశన్నతో సహా మొత్తం 210 మంది నక్సలైట్లు లొంగిపోయారు. వారు 153 ఆయుధాలను కూడా అప్పగించారు. అక్టోబర్ 2న బస్తర్ ప్రాంతంలోని బీజాపూర్ జిల్లాలో 103 మంది నక్సలైట్లు లొంగిపోయారు.

