HomeతెలంగాణSmita sabharwal | స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్.. భగవద్గీతలోని శ్లోకాన్ని గుర్తుచేస్తూ పోస్ట్

Smita sabharwal | స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్.. భగవద్గీతలోని శ్లోకాన్ని గుర్తుచేస్తూ పోస్ట్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Smita sabharwal | సీనియర్​ ఐఏఎస్​ అధికారిణి సిత్మా సబర్వాల్ ias Smita Sabarwal​ మరో సంచలన ట్వీట్​ smita tweet చేశారు. భగవద్గీతలోని ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన’ అనే వ్యాఖ్యాన్ని జోడించి ‘ఎక్స్​’లో పోస్టు పెట్టారు. గత నాలుగు నెలల్లో టూరిజం అభివృద్ధికి చేసిన కృషి గురించి రాసుకొచ్చారు. పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆమెను.. ఆర్థిక సంఘం (ఫైనాన్స్‌ కమిషన్‌) సభ్య కార్యదర్శిగా నియమించింది. అయితే స్మితా బదిలీపై చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఆమె ‘ఎక్స్‌’లో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ‘కర్మణ్యే వాధికారస్తే, మా ఫలేషు కదాచన’ అని ట్వీట్ చేశారు. దీనికి అర్థం.. ‘నువ్వు కర్మ చేయడానికి మాత్రమేగానీ, ఆ కర్మఫలానికి అధికారివి కాదు.. ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు.. అలాగని కర్మలు చేయడం మానకు’ అని భగవద్గీత చెబుతోంది.

అంతేకాకుండా టూరిజం డిపార్ట్‌మెంట్‌లో tourism department Telangana ఆమె అనుభాన్ని కూడా పంచుకున్నారు. టూరిజం శాఖలో నాలుగు నెలలు పనిచేశానని.. నా వంతు కృషి చేశానని పేర్కొన్నారు. అలాగే ఆమె టూరిజం డిపార్ట్‌మెంట్‌లో చేసిన పనులను రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె ట్వీట్​ నెట్టింట వైరల్​గా మారింది. ఆమె ట్వీట్​ వెనుక అర్థం ఏమై ఉంటుందా..? అనే చర్చ సాగుతోంది.