ePaper
More
    Homeటెక్నాలజీVivo S30 Pro Mini | అద్భుతమైన ఫీచర్స్‌తో వివో నుంచి మరో ఫోన్

    Vivo S30 Pro Mini | అద్భుతమైన ఫీచర్స్‌తో వివో నుంచి మరో ఫోన్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Vivo S30 Pro Mini | చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్‌ తయారీ కంపెనీ వివో vivo. మార్కెట్లో మరో మోడల్‌ను vivo new smart phones విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

    VIVO S 30 Pro Mini మోడల్ ను ఈనెల 29 న చైనా మార్కెట్‌లో లాంచ్‌ చేయనుంది. దీని ధర రూ. 45 వేల నుంచి ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. కాగా.. Vivo సాధారణంగా S సిరీస్ ఫోన్లను చైనాలో మాత్రమే రిలీజ్ చేస్తుంది. దాదాపు ఇవే ఫీచర్స్ తో గ్లోబల్ మార్కెట్లో V సిరీస్ ఫోన్లను విడుదల చేస్తుంది. దీని ప్రకారం ఇవే స్పెసిఫికేషన్స్ తో ఇండియాలో Vivo V 60 pro మోడల్ ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ప్రస్తుతం Vivo S 30 Pro Mini మోడల్‌కు సంబంధించిన ఫీచర్స్‌ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలలో అందుబాటులో ఉన్నాయి. ఆ ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందామా..

    Vivo S30 Pro Mini | డిస్‌ప్లే:


    6.31 inch ఎల్టీపీఎస్ ఓఎల్ఈడీ డిస్ ప్లే. 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్.

    Vivo S30 Pro Mini |ప్రాసెసర్‌:


    మీడియాటెక్ డైమెన్సిటీ 9400e ప్రాసెసర్.

    Vivo S30 Pro Mini | Operating System:


    ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టం

    వేరియంట్స్‌..
    12 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
    12 జీబీ ర్యామ్ + 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
    16 జీబీ ర్యామ్ + 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్

    Vivo S30 Pro Mini |కెమెరా:
    వెనుకవైపు 50 మెగా పిక్సెల్ సోనీ మెయిన్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 50 మెగా పిక్సెల్ టెలి ఫోటోలెన్స్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెట్ అప్.
    ముందువైపు 32 మెగా పిక్సెల్ కెమెరా ఉంది.

    బ్యాటరీ:
    6500 mAh. 90w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

    కలర్స్‌:
    మింట్ గ్రీన్, పీచ్ పింక్, లెమన్ యెల్లో, కోకో బ్లాక్ కలర్స్.

    More like this

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 11,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...