Homeటెక్నాలజీOnePlus 15 | శక్తిమంతమైన ప్రాసెసర్‌తో వన్‌ప్లస్‌నుంచి మరో ఫోన్‌

OnePlus 15 | శక్తిమంతమైన ప్రాసెసర్‌తో వన్‌ప్లస్‌నుంచి మరో ఫోన్‌

వన్‌ప్లస్‌ కంపెనీ మరో మోడల్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. భారీ బ్యాటరీ, శక్తిమంతమైన ప్రాసెసర్‌తో వన్‌ప్లస్‌ 15 పేరుతో వస్తున్న ఈ ఫోన్‌ను భారత్‌లో లాంచ్‌ చేయడానికి ముహూర్తం ఖరారు చేసింది. 13న లాంచ్‌ కానుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ అయిన వన్‌ప్లస్‌ కొత్త మోడల్‌ను తీసుకువస్తోంది. తన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ (Flagship smartphone) అయిన వన్‌ప్లస్‌ 15 మోడల్‌ను ఇప్పటికే చైనాలో (China) లాంచ్‌ చేసింది. వన్‌ప్లస్‌ 13కు కొనసాగింపుగా వన్‌ప్లస్‌ 15 తీసుకువచ్చింది.

మధ్యలో వన్‌ప్లస్‌ 14ను కంపెనీ స్కిప్‌ చేసింది. భారత్‌లో స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్‌ జెన్‌ 5 (Snapdragon 8 Elite Gen 5) ప్రాసెసర్‌ను వినియోగిస్తున్న మొదటి మోడల్‌ ఇదేనని కంపెనీ పేర్కొంటోంది. భారతదేశంలో గురువారం(నవంబర్‌ 13న) రాత్రి 7 గంటలకు విడుదల చేయనుంది. అదే రోజు రాత్రి రాత్రి 8 గంటలకు ఈ హ్యాండ్‌సెట్‌ అమ్మకాలు ప్రారంభమవుతాయి. అమెజాన్‌లో అందుబాటులో ఉండనుంది. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలలో అందుబాటులో ఉన్నమేరకు ఈ మోడల్‌ స్పెసిఫికేషన్స్‌ ఇలా ఉండనున్నాయి.

డిస్‌ప్లే : 6.78 అంగుళాల LTPO AMOLED ప్యానెల్‌తో వస్తున్న ఈ ఫోన్‌ 165 హెచ్‌జడ్‌ రిఫ్రెష్‌ రేట్‌, 1800 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, ఐపీ68 ఐపీ69 వాటర్‌ అండ్‌ డస్ట్‌ రెసిస్టెన్స్‌ కలిగి ఉంటుంది.

సాఫ్ట్‌వేర్‌ : భారతదేశంలో మొట్టమొదటి క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్‌ జెన్‌ 5 ఫ్లాగ్‌షిప్‌ చిప్‌సెట్‌ను ఇందులో అమర్చారు. ఈ చిప్‌సెట్‌ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మొబైల్‌ సీపీయూ(CPU). ఇది ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్‌ 16తో పనిచేస్తుంది.

కెమెరా : 50ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌906 ఓఐఎస్‌ మెయిన్‌ కెమెరా, 50 ఎంపీ అల్ట్రావైడ్‌ లెన్స్స్‌, 50 ఎంపీ టెలిఫొటో లెన్స్‌ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్‌ కోసం 32 ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌709 సెన్సార్‌ ఉంది.

బ్యాటరీ : 7300 ఎంఏహెచ్‌ బ్యాటరీని అమర్చారు. ఇది 120w ఫాస్ట్‌ చార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. 50w వైర్‌లెస్‌ ఫ్లాష్‌ చార్జ్‌తో వస్తోంది.

వేరియంట్‌ : 12జీబీ, 16జీబీ ఎల్‌పీడీడీఆర్‌5ఎక్స్‌ అల్ట్రా రామ్‌ ఎంపికలతో వస్తోంది. 1టీబీ వరకు యూఎఫ్‌ఎస్‌ 4.1 నిల్వ ఉంటుంది. దీని ధర రూ.75 వేల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు.

Must Read
Related News