అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Moto G67 Power 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ (Smart Phone) తయారీ సంస్థ అయిన మోటోరోలా భారత్ మార్కెట్‌లో కొత్త మోడల్‌ను లాంచ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది.
భారీ బ్యాటరీతో మోటో జీ67 పవర్ 5జీ(Moto G67 Power 5G) పేరుతో తీసుకువస్తున్న ఈ మోడల్‌ను వచ్చేనెల 5వ తేదీన లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. నూతన మోడల్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్స్ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాంలలో అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్(Flipkart)లో అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్(Specifications) ఇలా ఉండే అవకాశాలు ఉన్నాయి.
డిస్‌ప్లే : 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్‌ప్లే(Display)తో వస్తున్న మోటో జీ67 పవర్ 5జీ మోడల్ ఫోన్ 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 1080 * 2400 పిక్సల్స్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఐపీ64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణ ఇస్తుంది.
సాఫ్ట్‌వేర్ : స్నాప్ డ్రాగన్ 7s gen 2 ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్.. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టం ఆధారిత మోటో హలో యూఎక్స్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేయనుంది.
కెమెరా సెటప్ : వెనుకవైపు 50 మెగాపిక్సెల్(MP) సోనీ LYT – 600 మెయిన్ కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెట్ అప్, ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ సెన్సార్ ఉన్నాయి. ఇవి 4కే వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తాయి.
బ్యాటరీ సామర్థ్యం : 7000 mAh బ్యాటరీ సామర్థ్య కలిగి ఉంది. ఇది 33 వాట్ టర్బో చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
వేరియంట్స్ : బ్లూ, గ్రీన్, పర్పుల్ కలర్స్‌లో అందుబాటులో ఉండనుంది. 8 జీబీ(GB) ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్‌లలో లభిస్తుంది. బేస్ వేరియంట్ ధర రూ. 15,900 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

