Homeక్రైంSpying for Pak | మరో పాక్​ గూఢచారి అరెస్ట్​

Spying for Pak | మరో పాక్​ గూఢచారి అరెస్ట్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Spying for Pak | పహల్గామ్​ ఉగ్రదాడి(Pahalgam Terror Attack) తర్వాత భారత్​– పాకిస్తాన్​ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన విషయం తెలిసిందే. అనంతరం భారత్​ ఆపరేషన్​ సిందూర్(Operatiom Sindoor)​తో ఉగ్రవాదులతో పాటు పాకిస్తాన్​కు బుద్ధి చెప్పింది. అనంతరం కాల్పుల విరమణ(Ceasefire) ఒప్పందం అమలులోకి రాగా భారత్​ ఇంటిదొంగల పని పడుతోంది. భారత్​లో ఉంటూ పాకిస్తాన్​కు రహస్యాలను చేరవేస్తున్న వారిని నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు అరెస్ట్​ చేస్తున్నారు.

హిమచల్​ ప్రదేశ్ (Himachal Pradesh)​లోని కాంగ్రా ప్రాంతానికి చెందిన అభిషేక్​ భరద్వాజ్​(20) పాకిస్తాన్​కు భారత రహస్యాలను చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిందితుడిని గురువారం ఉదయం 4 గంటలకు పోలీసులు అరెస్ట్​ చేశారు. అభిషేక్​ కాలేజీ డ్రాప్​ అవుట్​గా గుర్తించారు. కొన్ని వారాలుగా నిందితుడిపై నిఘా ఉంచిన అధికారులు పాకిస్తాన్​కు రహస్యంగా సమాచారం అందిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించడంతో వారు అరెస్ట్​ చేశారు.