అక్షరటుడే, వెబ్‌డెస్క్ : POCO C85 5G | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ పోకో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను (Smart Phone) తీసుకువచ్చింది. సీ సిరీస్ వెర్షన్లలో భాగంగా పోకో సీ 85 5జీ (POCO C85 5G) స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. పెద్ద డిస్ప్లేతో పాటు అదిరిపోయే ఫీచర్లతో తీసుకువచ్చిన ఈ ఫోన్ బడ్జెట్ ధరలోనే అందుబాటులో ఉంది. డిసెంబర్ 16న మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ (Flipkart)తో పాటు కంపెనీ అధికారిక వెబ్సైట్లో సేల్ అందుబాటులో ఉంటుంది. ఈ మోడల్ ఫీచర్లు చూసేద్దామా..
POCO C85 5G | డిస్ప్లే..
6.9 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే అమర్చారు. 120Hz రిఫ్రెష్ రేట్, హై బ్రైట్నెస్ మోడ్ 810 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను అందిస్తుంది. ఈ డిస్ప్లే టీయూవీ రీన్ల్యాండ్లో బ్లూ లైట్, ఫ్లికర్ ఫ్రీ, కంటి రక్షణ కోసం సర్కాడియన్ ఫ్రెండ్లీ సర్టిఫికేషన్లతో వస్తోంది. ఈ ఫోన్ దుమ్ము, నీటి రక్షణ కోసం IP64 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది 7.99ఎంఎం మందంతో క్వాడ్కర్వ్డ్ బ్యాక్ డిజైన్‌ను కలిగి ఉంది.
POCO C85 5G | సాఫ్ట్వేర్..
మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్తో ఈ ఫోన్ రూపొందించారు. ఈ పరికరం ఆండ్రాయిడ్ 15 ఆధారంగా హైపర్ OS 2.2పై రన్ అవుతుంది. దీనికి రెండు ఓఎస్ అప్డేట్లు, నాలుగేళ్ల పాటు సాఫ్ట్వేర్ అండ్ సెక్యూరిటీ అప్డేట్లను అందిస్తామని కంపెనీ తెలిపింది.
POCO C85 5G | బ్యాటరీ సామర్థ్యం..
6,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది. ఇది 106 గంటలకుపైగా మ్యూజిక్ ప్లేబ్యాక్ (Music Playback) వస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే 33w వైర్డు ఫాస్ట్ చార్జింగ్, 10w వైర్డు రివర్స్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
కెమెరా సెటప్ : డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, క్యూవీజీఏ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
వేరియంట్ల వారీగా ధరలు..
మిస్టిక్ పర్పుల్, స్ప్రింగ్ గ్రీన్, పవర్ బ్లాక్ కలర్స్‌లో మూడు వేరియంట్ల(Variants)లో ఈ మోడల్‌ను తీసుకువచ్చారు.
4జీబీ వరకు రామ్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,499.
6జీబీ వరకు రామ్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13,499.
8జీబీ వరకు రామ్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,499.
లాంచ్ ఆఫర్లో భాగంగా పోకో 4జీబీ, 6జీబీ వేరియంట్లపై కంపెనీ రూ.500 తక్షణ తగ్గింపు(Discount)ను అందిస్తోంది. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్, ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.