అక్షరటుడే, వెబ్‌డెస్క్: ULPGM-V3 | భారత రక్షణ రంగం పురోభివృద్ధి సాధిస్తోంది. తన అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరనుంది. ఏపీలోని కర్నూలు జిల్లా NOARలో డీఆర్డీవో యూఏవీ(Unmanned Aerial Vehicle) నుంచి ప్రయోగించిన ప్రెసిషన్ గైడెడ్ క్షిపణి విజయవంతమైంది. ఈ విజయం దేశ రక్షణ సామర్థ్యాలను పెంచడమే కాకుండా, స్వదేశీ రక్షణ సాంకేతికత అభివృద్ధిలో మన పురోగతిని సూచిస్తుంది.
ULPGM-V3 | అధునాతన ఆయుధ వ్యవస్థ
ULPGM-V3 అనేది డీఆర్డీవో అభివృద్ధి చేసిన అధునాతన ఎక్స్‌టెండెడ్ రేంజ్ క్షిపణి. దీనిని ULM-ER అని కూడా పిలుస్తారు. ఈ క్షిపణి ఉదయం, రాత్రి రెండు సమయాల్లోనూ ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం కలిగి ఉంది. ఇది ఇమేజింగ్ ఇన్‌ఫ్రారెడ్ (IIR) సీకర్లు, డ్యూయల్-త్రస్ట్ ప్రొపల్షన్ సిస్టమ్ వంటి అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉంది. ఈ క్షిపణి బహుళ రకాల వార్‌హెడ్‌లతో స్థిర, కదిలే లక్ష్యాలను లక్ష్యంగా చేసుకోని దాడి చేయగలుగుతుంది.
ఈ క్షిపణి వివిధ రకాల యుద్ధ రంగాల్లో మైదానాల నుంచి అధిక ఎత్తు ప్రాంతాల వరకు పనిచేసే సామర్థ్యం కలిగి ఉంది. ఇది ఆర్మర్డ్ వాహనాలు, బలమైన బంకర్లు, శత్రు స్థానాలను కచ్చితత్వంతో దాడి చేయగలరు. బెంగళూరు ఆధారిత స్టార్టప్ న్యూస్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ (Newspace Research and Technologies) దీనిని అభివృద్ధి చేసింది.
ULPGM-V3 | స్వదేశీ సాంకేతికతలో మరో మైలు రాయి
ULPGM-V3 అభివృద్ధి స్వదేశీ సాంకేతికతలో మరో మైలు రాయిగా నిలవనుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh) ఈ విజయాన్ని ‘X’ వేదికగా ప్రశంసించారు. “ఈ విజయం దేశ పరిశ్రమ కీలక రక్షణ సాంకేతికతలను గ్రహించి, ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉందని నిరూపిస్తోంది” అని ఆయన పేర్కొన్నారు.