అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyperloop system | రవాణా రంగంలో (transportation sector) దేశం విప్లవాత్మకమైన అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా స్వదేశీ హైపర్‌లూప్ రవాణా వ్యవస్థను (Hyperloop transportation system) అభివృద్ధి చేయడానికి భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) మరియు IIT మద్రాస్‌లో ఇన్‌క్యూబేట్ చేయబడిన డీప్-టెక్ స్టార్టప్ TuTr హైపర్‌లూప్‌తో సహకారం కోసం అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై నేడు సంతకం చేశాయి. ఇది దేశ రవాణా రంగంలో ఒక మైలురాయిగా నిలనుంది.
Hyperloop System | అసలు హైపర్‌లూప్ అంటే ఏమిటి?
హైపర్‌లూప్ అనేది అత్యంత వేగవంతమైన రవాణా వ్యవస్థగా పేర్కొంటారు. ఇందులో ప్రయాణికులు లేదా సరుకులను తీసుకెళ్లే పాడ్‌లు సీల్డ్ ట్యూబ్‌లలో సమీప-వాక్యూమ్ పరిస్థితుల్లో ప్రయాణం చేస్తాయి. ఈ వ్యవస్థ మాగ్నెటిక్ లెవిటేషన్ (మ్యాగ్‌లెవ్), లీనియర్ ఇండక్షన్ మోటార్ (LIM) ప్రొపల్షన్ టెక్నాలజీలను ఉపయోగించి పనిచేస్తుంది. ఈ సాంకేతికతను తొలిసారి 2013లో ఎలాన్ మస్క్ (Elon Musk) తన వైట్ పేపర్‌లో ప్రతిపాదించారు. ఇది సాంప్రదాయ రైలు, విమాన రవాణాకు ప్రత్యామ్నాయంగా మారనుంది.
Hyperloop System | BEML, TuTr మధ్య ఒప్పందం
హైపర్‌లూప్ వ్యవస్థను (Hyperloop system) డెవలప్ చేయడానికి BEML, TuTr మధ్య ఒప్పందం కుదిరింది. ఈ వ్యవస్థను అభివృద్ధి చేస్తే రవాణా రంగంలో మరో మైలురాయి కానుంది. దీని ద్వారా ప్రయాణికులు మరియు సరుకులను అత్యధిక వేగంతో రవాణా చేయవచ్చు. BEML, TuTr కలిసి ప్రోటోటైప్ పాడ్‌ను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఒప్పందంపై BEML ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శంతను రాయ్ (Shantanu Rai) స్పందించారు. హైపర్‌లూప్ సాంకేతికతను అభివృద్ధి చేయడం ద్వారా వికసిత్ భారత్ (Vikasit Bharat) 2047 మరియు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. “ఈ భాగస్వామ్యం భారతదేశ హై స్పీడ్ రవాణా ఆకాంక్షలకు ఒక పెద్ద ముందడుగు” అని ఆయన పేర్కొన్నారు.