అక్షరటుడే, వెబ్‌డెస్క్: Redmi Note 15 5G | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్స్ (Smart Phones) తయారీ సంస్థ అయిన రెడ్మీ మిడ్‌రేంజ్‌లో మరో మోడల్‌ను తీసుకువస్తోంది. రెడ్మీ నోట్ 15 పేరుతో వచ్చేనెల 6న భారత మార్కెట్ (Indian Market)లో విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన పోస్టర్ అమెజాన్ (Amazon)లో కనిపించింది. పూర్తి వివరాలు రివీల్ కావాల్సి ఉంది. ఆన్లైన్ ప్లాట్‌ఫాంల ద్వారా లీకైన సమాచారం మేరకు ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ వివరాలిలా ఉన్నాయి.
6.77 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఇచ్చారు. ఇది 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 1920 * 1080 పిక్సల్స్ రిజల్యూషన్, IP66 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కలిగి ఉంది.
స్నాప్ డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్ అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఓఎస్ ఆధారిత హైపర్ ఓఎస్ 3 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.
వెనుకవైపు 108 మాస్టర్ పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెట్ అప్ ఇచ్చారు. ఇది 4కే వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20 మెగా పిక్సెల్ కెమెరా ఉంది.
5520 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం గల 45w ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
ఈ ఫోన్ రెండు వేరియంట్స్‌లో రానుంది. బేస్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 22,999, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,999 లుగా ఉండే అవకాశాలున్నాయి.