HomeUncategorizedChhattisgarh | భార్య వేధింపులకు మరో వ్యక్తి బలి.. తన ఆవేదనను వీడియో తీసి సూసైడ్​..

Chhattisgarh | భార్య వేధింపులకు మరో వ్యక్తి బలి.. తన ఆవేదనను వీడియో తీసి సూసైడ్​..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Chhattisgarh | భార్య వేధింపులతో ఇటీవల హర్యానా(Haryana)లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం మరువకముందే మరో ఘటన వెలుగు చూసింది. ప్రియుడితో కలిసి ఉన్న ప్రైవేట్​ వీడియో పంపడంతో మనస్తాపం చెందిన హర్యానాలోనిక రోహ్తక్​ ప్రాంతానికి చెందిన ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. భార్య, అత్త వేధించడంతో ఛత్తీస్​గఢ్​(Chhattisgarh)లోని బిలాస్​పూర్​లో చోటు చేసుకుంది. ఈ ఘటన ఈ నెల 7 చోటు చేసుకోగా తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌(Bilaspur)కు చెందిన ఆనంద్ దేవాంగన్ రైలు కింద దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఆయన ఓ వీడియో రికార్డు(Video record) చేశాడు. తన భార్య, అత్తమామలు వేధిస్తున్నారని అందులో వాపోయాడు. వివరాలు.. ఆనంద్​కు గతేడాది నవంబర్​ 27న వివాహం జరిగింది. అయితే పెళ్లయిన నాలుగు నెలలకే అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అంతేగాకుండా తను వేధించిందని ఆనంద్​ వీడియోలో వాపోయాడు.

Chhattisgarh | సాయం లభించలేదు..

తన భార్య వేధింపులపై తాను చాలా మంది న్యాయవాదులను(Lawyers) సంప్రదించినప్పటికీ ఎటువంటి సహాయం లభించలేదని ఆనంద్ పేర్కొన్నాడు. న్యాయ వ్యవస్థలో అమ్మాయి పక్షం బలంగా ఉందని అందరూ అంటారని వాపోయాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ఒక రోజు ముందు కూడా ఆనంద్​ భార్యతో మాట్లాడాడు. అయితే ఆమె తిరిగి రావడానికి ఒప్పుకోలేదు. దీంతో ఆయన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.

Chhattisgarh | వేరే మార్గం లేదు.

తనకు ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదని వీడియోలో పేర్కొన్నాడు. ‘‘చట్టం లేదు, వ్యవస్థ లేదు, వినడానికి ఎవరూ లేరు. అందరూ అమ్మాయి మాట మాత్రమే వింటారు. నేను కూడా ఇబ్బందుల్లో ఉన్నాను,” అని అతను చెప్పాడు. అంతేగాకుండా తన భార్య తనకు తెలియకుండా అబార్షన్​ చేయించుకుందన్నాడు. అయితే తన భార్య ఆస్తి కోసం తనను వివాహం చేసుకున్నట్లు చెప్పిందని ఆనంద్​ పేర్కొన్నాడు. తన సంపదలో భార్య, అత్తమామలకు ఒక్క పైసా కూడా ఇవ్వొద్దని ఆయన అధికారులను కోరాడు.

Must Read
Related News