అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Earthquake in russia | రష్యాలో వరుస భూకంపాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. బుధవారం కమ్చట్కా దీవుల్లో (Kamchatka Islands) భారీ భూకంపం (Earthquake) వచ్చిన విషయం తెలిసిందే. ఆదివారం మరో భూకంపం చోటు చేసుకుంది. రష్యాలోని కురిల్ దీవుల్లో (Kuril Islands) 7.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అనంతరం వాటిని ఉపసంహరించుకుంది.
కురిల్ దీవుల్లో భూకంపంతో పలు ప్రాంతాల్లో భవనాలు ఊగిపోయాయి. దీంతో ప్రజలు ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ ఘటనలో ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.0గా ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరిక వ్యవస్థ తెలిపింది. అయితే సునామీ హెచ్చరికలు లేవని పేర్కొంది. అలల తాకిడి అధికంగా ఉంటుందని ప్రజలు తీర ప్రాంతాలకు వెళ్లొద్దని కోరింది.
Earthquake in russia | కమ్చట్కా దీవుల్లో బద్దలైన అగ్నిపర్వం
కమ్చట్కా దీవుల్లో (Kamchatka Islands) శనివారం రాత్రి అగ్ని పర్వతం బద్దలైంది. 600 సంవత్సరాలలో మొదటిసారిగా కమ్చట్కాలో క్రాషెన్నినికోవ్ అగ్నిపర్వతం విస్పోటనం చెందడం గమనార్హం. గత వారం వచ్చిన భూకంపంతోనే అగ్ని పర్వతం బద్దలై ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అగ్నిపర్వతం విస్పోటనం చెందిన తర్వాత 6 వేల మీటర్లు ఎత్తుకు బూడిద లేచినట్లు రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
View this post on Instagram