అక్షరటుడే, గాంధారి: Gandhari | రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న పలువురు సీడ్స్ డీలర్లు (seeds dealers) వారిని నిండా ముంచుతున్నారు. ప్రస్తుతం రైతులకు యూరియా (urea) అవసరముండడంతో, గాంధారి మండలకేంద్రంలో వ్యాపారులు మోసానికి తెరలేపారు. మూడు యూరియా సంచులు (urea Bags) కొంటే, అదనంగా కంపెనీకి చెందిన మరో వస్తువు అంటగడుతున్నారు. దీంతో సోమవారం భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులతో కలిసి విత్తన డీలర్ దుకాణాల్లో పరిశీలించగా, ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ విషయమై ఏవో రాజలింగంను ఫోన్‌లో సంప్రదించగా అలాంటిదేమీ లేదని సమాధానమిచ్చినట్లు చెప్పాడు. కలెక్టర్, డీఏవోకు విషయం వివరించడంతో వారు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.
