అక్షరటుడే, వెబ్డెస్క్ : GMP IPO | రోజువారీ అవసరాల కోసం ప్లాస్టిక్ కన్స్యూమర్‌వేర్ ఉత్పత్తులను తయారు చేసే ఆల్ టైమ్ ప్లాస్టిక్స్(All Time Plastics) ఐపీవోకు వస్తోంది. గురువారం సబ్‌స్క్రిప్షన్(Subscription) ప్రారంభం కానుంది. ఐపీవో వివరాలలిలా ఉన్నాయి..
ఆల్ టైమ్ ప్లాస్టిక్స్ రోజువారీ అవసరాలకోసం ప్లాస్టిక్ కన్స్యూమర్‌వేర్ ఉత్పత్తులను తయారు చేసి బీటూసీ(B2C) ప్రాతిపదికన విక్రయిస్తుంది. ఇది ఎనిమిది విభాగాలలో 1,848 స్టాక్ కీపింగ్ యూనిట్ల(Stock keeping unit)ను కలిగి ఉంది. ఇది 28 దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఈ కంపెనీ 22 ఆధునిక వాణిజ్య రిటైలర్లు, 5 సూపర్ డిస్ట్రిబ్యూటర్లు, 38 డిస్ట్రిబ్యూటర్లకు ఉత్పత్తులను విక్రయించింది. ఈ కంపెనీ మార్కెట్‌నుంచి రూ. 400.60 కోట్లు సమీకరించనుంది. ఇందులో ఫ్రెష్ ఇష్యూ(Fresh issue) ద్వారా రూ. 280 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 120.60 కోట్లు సమీకరించనున్నారు.
ముఖ్యమైన తేదీలు..
ఐపీవో సబ్‌స్క్రిప్షన్ గురువారం ప్రారంభమవుతుంది. సోమవారం ముగుస్తుంది. 12వ తేదీన రాత్రి అలాట్‌మెంట్ స్టేటస్ వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. కంపెనీ షేర్లు 14న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతాయి.
ప్రైస్ బాండ్..
కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు(Equity share) ధరను రూ. 260 నుంచి రూ. 275గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 54 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్ బాండ్ వద్ద రూ. 14,850తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కోటా, జీఎంపీ..
ఐపీవోలో క్యూఐబీ(QIB)లకు 50 శాతం, హెచ్‌ఎన్‌ఐలకు 155 శాతం కేటాయించిన కంపెనీ.. రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం రిజర్వ్ చేసింది. ఈ కంపెనీ షేర్లకు జీఎంపీ(GMP) రూ. 25గా ఉంది. అంటే లిస్టింగ్ రోజు 9 శాతం లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.