అక్షరటుడే, వెబ్‌డెస్క్: Highway Infrastructure IPO : స్టాక్ మార్కెట్ నుంచి నిధులు సమీకరించేందుకు మరో కంపెనీ ఐపీవో(IPO)కు వస్తోంది. హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్(Highway Infrastructure) కంపెనీ ఐపీవో మంగళవారం(ఆగస్టు 5) ప్రారంభం కానుంది.
టోల్ వసూలు, EPC కేంద్రీకృత సంస్థ అయిన హైవే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (HIL).. మార్కెట్‌నుంచి రూ. 130 కోట్లు సమీకరించేందుకోసం ఐపీవోకు వచ్చింది. ఇది ప్రధానంగా మూడు వ్యాపార విభాగాలలో పనిచేసే సమగ్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ. ఇది టోల్‌వే కలెక‌్షన్ (ETC కార్యకలాపాలు), ఇంజినీరింగ్, సేకరణ, నిర్మాణం (EPC) మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్ అభివృద్ధి విభాగాలలో పనిచేస్తోంది. ఐపీవో ద్వారా సమకూరే ఆదాయాన్ని టోల్, EPC కాంట్రాక్టులను సజావుగా నిర్వహించడానికి, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకోసం వినియోగించనుంది. ఐపీవో వివరాలిలా ఉన్నాయి.
Highway Infrastructure IPO : జారీ చేసే షేర్లు..
- మొత్తం ఇష్యూ సైజ్ : 1,85,71,428 షేర్లు(రూ. 130 కోట్లు)
- ఫ్రెష్ ఇష్యూ : 1,39,14,428 షేర్లు (రూ. 97.52 కోట్లు)
- ఆఫర్ ఫర్ సేల్ : 46,40,000 షేర్లు (రూ. 32.48 కోట్లు)
Highway Infrastructure IPO : ధరల శ్రేణి..
- ముఖ విలువ : రూ. 5.
- గరిష్ట ప్రైస్ బాండ్ వద్ద ఒక్కో షేరు ధర : రూ. 70.
- లాట్ సైజు : 211 షేర్లు.
(రిటైల్ ఇన్వెస్టర్లు ఒక లాట్ కోసం రూ. 14,770తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది)
Highway Infrastructure IPO : ఐపీవోకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు..
- ప్రారంభ తేదీ : ఆగస్టు 5
- ముగింపు తేదీ : ఆగస్టు 7
- అలాట్‌మెంట్ తేదీ : ఆగస్టు 8
- లిస్టింగ్ తేదీ : ఆగస్టు 12 (బీఎస్‌ఈతోపాటు ఎన్‌ఎస్‌ఈలో కంపెనీ షేర్లు లిస్టవుతాయి)
Highway Infrastructure IPO : కోటా..
- రిటైల్ : 40 శాతం.
- క్యూఐబీ : 30 శాతం.
- ఎన్‌ఐఐ : 30 శాతం.
Highway Infrastructure IPO : జీఎంపీ(GMP)..
హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీ షేరు రూ. 40 ప్రీమియంతో ఉంది. అంటే ఐపీవో అలాట్ అయినవారికి లిస్టింగ్ రోజే 57 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.