అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Leela Hotels IPO | మెయిన్ బోర్డు ఐపీవో(Main Board IPO) అందుబాటులోకి రానుంది. దేశంలోని పలు నగరాలతో పాటు పర్యాటక ప్రాంతాలలో లగ్జరీ హోటల్స్, రిసార్ట్స్ ను నిర్వహిస్తూ హాస్పిటాలిటీ సర్వీసెస్‌ను అందిస్తున్న Schloss బెంగళూరు లిమిటెడ్(లీలా హోటల్స్) మార్కెట్‌నుంచి రూ. 3,500 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవో(IPO)కు వస్తోంది. ఇందులో రూ. 2,500 కోట్ల విలువైన 5.75 కోట్ల తాజా షేర్లను ఇష్యూ చేయనున్నారు. రూ. వెయ్యి కోట్ల విలువైన 2.3 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనున్నారు.
Leela Hotels IPO | సబ్‌స్క్రిప్షన్ వివరాలు..
సబ్‌స్క్రిప్షన్(Subscription) ఈనెల 26న ప్రారంభమవుతుంది. 28న ముగుస్తుంది. 29వ తేదీన అలాట్‌మెంట్ స్టేటస్ ప్రకటిస్తారు. షేర్లు అలాట్ కానివారికి 30వ తేదీన డబ్బులు రీఫండ్ అయ్యే అవకాశాలున్నాయి. లీలా హోటల్స్ షేర్లు BSE, NSEలలో జూన్ 2న లిస్ట్ అవుతాయి.
Leela Hotels IPO | ధరల శ్రేణి..
ఒక్కో షేరుకు రూ. 413 నుంచి రూ. 435. ఒక లాట్‌లో 34 షేర్లుంటాయి. రిటైల్ పెట్టుబడిదారులు కనీసం రూ. 14,790తో దరఖాస్తు చేసుకోవాలి. రిటైల్ కోటా 10 శాతమే ఉంది.
GMP..
ప్రస్తుతం గ్రే మార్కెట్ ప్రీమియం రూ. 12 మాత్రమే ఉంది.
