అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్ యాక్సిలరేటర్ కంపెనీ ఐపీవోకు వస్తోంది. సబ్‌స్క్రిప్షన్ ప్రారంభమై.
DevX అని కూడా పిలువబడే (Dev Accelerator Limited)ను 2017లో స్థాపించారు. ఇది ఆఫీస్ స్పేస్, కోవర్కింగ్ డెస్క్ వంటి సౌకర్యవంతమైన ఆఫీస్ ఎంపికలను అందిస్తుంది. దేశంలోని 11 నగరాల్లో 28 కేంద్రాలను స్థాపించింది. వీటిలో ఢిల్లీ NCR, ముంబయి, హైదరాబాద్, పుణే వంటి ప్రధాన నగరాల్లో వ్యాపార కేంద్రాలు ఉన్నాయి. SMEలు మరియు బహుళజాతి సంస్థలు రెండింటిలోనూ 250 కంటే ఎక్కువ వివిధ క్లయింట్‌లకు సేవలందిస్తోంది.
డెవ్ యాక్సిలరేటర్ ఐపీవో ద్వారా రూ. 143.35 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. 2.35 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారా ఈ నిధులను సమీకరించనుంది. ఐపీవో(IPO) ద్వారా వచ్చిన ఆదాయాన్ని కొత్త కేంద్రాల అభివృద్ధికి మూలధన వ్యయంగా ఉపయోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. పెండింగ్‌లో ఉన్న రుణాలను చెల్లించడం, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలకు కొంత మొత్తాన్ని వినియోగించనున్నట్లు పేర్కొంది.
ప్రైస్‌బాండ్ : ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 56 రూ. 61 గా నిర్ణయించింది. ఒక లాట్( Lot)లో 235 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు గరిష్ట ప్రైస్‌బాండ్(Price band) వద్ద ఒక లాట్ కోసం రూ. 14,335 తో దరఖాస్తు చేసుకోవాలి.
కోటా, జీఎంపీ : 75 శాతం క్యూఐబీ(QIB)లకు, 15 శాతం ఎన్‌ఐఐలకు, 10 శాతం రిటైల్ పెట్టుబడిదారులకు కేటాయించారు. ఈ కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్ ప్రీమియం రూ. 9 గా ఉంది. అంటే లిస్టింగ్ సమయంలో 14 శాతానికిపైగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు : ఐపీవో బిడ్డింగ్ బుధవారం ప్రారంభమై శుక్రవారం ముగుస్తుంది. షేర్ల అలాట్‌మెంట్ స్టేటస్ 15న రాత్రి వెల్లడయ్యే అవకాశాలున్నాయి. ఈ కంపెనీ షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో ఈనెల 17న లిస్ట్ కానున్నాయి.