Homeబిజినెస్​Indogulf Crop sciences IPO | మార్కెట్‌లోకి మరో ఐపీవో.. గ్రే మార్కెట్ ప్రీమియం ఎంతంటే..

Indogulf Crop sciences IPO | మార్కెట్‌లోకి మరో ఐపీవో.. గ్రే మార్కెట్ ప్రీమియం ఎంతంటే..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Indogulf Crop sciences IPO | ఇన్వెస్టర్లకోసం మరో ఐపీవో(IPO) వస్తోంది. గురువారం నుంచి సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం కానుంది. జీఎంపీ 10 శాతంగా ఉంది.

జమ్మూకశ్మీర్, హర్యానా రాష్ట్రాలలో మొత్తం 20 ఎకరాల విస్తీర్ణంలో నాలుగు మ్యాన్‌ఫాక్చరింగ్‌ ఫెసిలిటీస్‌ కలిగి, క్రాప్ ప్రొటెక్షన్ ప్రొడక్ట్స్, ప్లాంట్ న్యూట్రియంట్స్, బయోలాజికల్స్‌ తయారు చేసే కంపెనీ అయిన ఇండోగల్ఫ్ క్రాప్ సైన్సెస్(Indogulf Cropsciences) లిమిటెడ్ ఐపీవోకు వచ్చింది. మార్కెట్‌నుంచి రూ. 200 కోట్లు సమీకరించాలన్నది లక్ష్యం. ఫ్రెష్ ఇష్యూ(Fresh issue) ద్వారా రూ. 10 ఫేస్ వ్యాల్యూ కలిగిన 1.44 కోట్ల షేర్లను విక్రయించి రూ.160 కోట్లను సమీకరించనున్నారు. అలాగే ఆఫర్ ఫర్ సేల్(OFS) కింద రూ. 10 ఫేస్ వ్యాల్యూ కలిగిన 36 లక్షల షేర్లను విక్రయించడం ద్వారా మరో రూ. 40 కోట్లను పొందాలని కంపెనీ భావిస్తోంది. ఐపీవో ద్వారా వచ్చిన ఆదాయాన్ని రుణాలను పూర్తిగా లేదా పాక్షికంగా చెల్లించడం కోసం, వర్కింగ్ క్యాపిటల్ కోసం, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం, హర్యానాలో కొత్త ఇన్ హౌస్ డ్రై ఫ్లోవబుల్ ప్లాంట్ ఏర్పాటు కోసం వినియోగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ప్రైస్‌బాండ్: ఈ కంపెనీ ప్రైస్‌ బాండ్‌(Price band)ను ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 105 నుంచి రూ. 111 గా నిర్ణయించింది. లాట్‌లో 135 షేర్లున్నాయి. ఐపీవోలో పాల్గొనాలనుకునేవారు ఒక లాట్‌ కోసం రూ. 14,985తో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు: ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌(Subscription) గురువారం ప్రారంభమై, 30వ తేదీ వరకు కొనసాగుతుంది. ఒకటో తేదీన రాత్రి అలాట్‌మెంట్‌ స్టేటస్‌ ప్రకటించే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు మూడో తేదీన ఎన్‌ఎస్‌ఈ, బీఎస్ఈలలో లిస్ట్ కానున్నాయి.

కోటా:రిటైల్(Retail) ఇన్వెస్టర్లకు 35 శాతం, క్యూఐబీలకు 50 శాతం, ఎన్ఐఐలకు 15 శాతం వాటాను కేటాయించారు.

జీఎంపీ: ఇండోగల్ఫ్ క్రాప్ సైన్సెస్ లిమిటెడ్ ఐపీవోకు సంబంధించి గ్రే మార్కెట్ ప్రీమియం(GMP) రూ. 11 గా ఉంది. అంటే ఐపీవో అలాట్‌ అయినవారికి లిస్టింగ్‌ రోజు 10 శాతం లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.