Homeబిజినెస్​Anlon Healthcare IPO | మార్కెట్లోకి మరో ఐపీవో.. అన్లాన్ హెల్త్ కేర్ సబ్ స్క్రిప్షన్...

Anlon Healthcare IPO | మార్కెట్లోకి మరో ఐపీవో.. అన్లాన్ హెల్త్ కేర్ సబ్ స్క్రిప్షన్ ప్రారంభం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Anlon Healthcare IPO | అన్లాన్ హెల్త్‌కేర్‌(Anlon Healthcare) కంపెనీ రూ. 121 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. ఈ కంపెనీ సబ్‌స్క్రిప్షన్‌(Subscription) మంగళవారం ప్రారంభమైంది. 29న ముగుస్తుంది. ఈనెల 3న లిస్టవుతాయి.

రాజ్‌కోట్‌కు చెందిన అన్లాన్ హెల్త్‌కేర్ అనేది పరిశోధన, అభివృద్ధి ఆధారిత రసాయనాల తయారీ సంస్థ. టాబ్లెట్స్(Tablets), క్యాప్సూల్స్, ఆయింట్‌మెంట్, సిరప్ మొదలైన వివిధ రకాల ఫినిష్డ్ డోసేజ్ ఫార్ములా(FDF), న్యూట్రాస్యూటికల్స్ ఫార్ములేషన్లలోని పదార్థాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు మరియు జంతు ఆరోగ్య ఉత్పత్తుల తయారీలో ఔషధ సూత్రీకరణలకు ముడి పదార్థంగా పనిచేసే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాలు(API) తయారు చేస్తుంది. ఈ సందర్భంగా మార్కెట్‌నుంచి రూ. 121.03 కోట్లు సమీకరించేందుకు ఐపీవో(IPO)కు వస్తోంది. ఐపీవో ద్వారా వచ్చిన ఆదాయాన్ని తయారీ సౌకర్యం విస్తరణకు మూలధన వ్యయ అవసరాలకు నిధులు సమకూర్చడం, సెక్యూర్డ్ రుణాలను పూర్తిగా లేదా పాక్షికంగా తిరిగి చెల్లించడానికి, కంపెనీ వర్కింగ్ క్యాపిటల్(Working capital) అవసరాలకోసం, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ పేర్కొంది.

ఐపీవో తేదీలు..

ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌ మంగళవారం ప్రారంభమైంది. 29 న ముగుస్తుంది. సెప్టెంబర్‌ ఒకటో తేదీన షేర్ల తాత్కాలిక అలాట్‌మెంట్‌ స్టేటస్‌ వెల్లడయ్యే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు 3 వ తేదీన బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతాయి.

ప్రైస్ బాండ్..

గరిష్ట ప్రైస్‌ బాండ్‌(Price band) వద్ద ఒక్కో ఈక్విటీ షేరు ధర రూ. 91. ఒక లాట్‌లో 164 షేర్లుంటాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు ఒక లాట్‌ కోసం రూ. 14,924 తో దరఖాస్తు చేసుకోవాలి.

కోటా, జీఎంపీ..

క్యూఐబీ(QIB)లకు 75 శాతం, ఎన్‌ఐఐలకు 15 శాతం, రిటైల్‌ ఇన్వెస్టర్లకు 10 శాతం షేర్లను కేటాయించారు. ఈ కంపెనీ షేర్లు గ్రే మార్కెట్లో 5 శాతం ప్రీమియంతో ట్రేడ్ అవుతున్నాయి.