ePaper
More
    Homeబిజినెస్​IPO | రేపటి నుంచి మరో ఐపీవో.. అలాట్ అయితే కాసుల పంటే!

    IPO | రేపటి నుంచి మరో ఐపీవో.. అలాట్ అయితే కాసుల పంటే!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: IPO | ల్యాప్‌ టాప్‌లు, డెస్క్‌టాప్‌ల రిఫర్బిష్డ్‌ సర్వీసెస్‌ అందించే జీఎన్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఐపీవోకు (GNG Electronics IPO) వస్తోంది. సబ్‌స్క్రిప్షన్‌ బుధవారం ప్రారంభం కానుంది. ఇది భారీ లాభాలు అందిస్తుందని భావిస్తున్నారు. ఐపీవో వివరాలిలా ఉన్నాయి.

    జీఎన్జీ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ (GNG Electronics Company) మనదేశంతోపాటు అమెరికా, యూరోప్‌, ఆఫ్రికా, యూఏఈ వంటి దేశాలలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ ల్యాప్‌టాప్స్‌, డెస్క్‌ టాప్స్‌, ఐసీటీ డివైజెస్‌కు సంబంధించిన రిఫర్బిష్డ్‌ సర్వీసెస్‌ అందిస్తోంది. ఇది ఐపీవో ద్వారా రూ. 460.43 కోట్లు సమీకరించడానికి సిద్ధమైంది. ఫ్రెష్‌ ఇష్యూ ద్వారా రూ. 2 ఫేస్‌ వ్యాల్యూ కలిగిన 1,68,77,637 షేర్లను విక్రయించి రూ. 400 కోట్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా 25,50,000 షేర్లను విక్రయించి రూ. 60.44 కోట్లు సమీకరించనున్నారు. ఐపీవో ద్వారా వచ్చిన ఆదాయాన్ని కంపెనీ ఇప్పటికే తీసుకున్న రుణాలను పూర్తిగా లేదా పాక్షికంగా చెల్లించడం కోసం, సాధారణ కార్పొరేట్‌ అవసరాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ పేర్కొంది.

    IPO | ముఖ్యమైన తేదీలు..

    ఐపీవోకి సంబంధించిన సబ్‌స్క్రిప్షన్‌ (IPO subscription) బుధవారం ప్రారంభం కానుంది. శుక్రవారం వరకు బిడ్డింగ్‌కు అవకాశం ఉంది. సోమవారం రాత్రి అలాట్‌మెంట్‌ స్టేటస్‌ వెల్లడయ్యే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు 30న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతాయి.

    IPO | ధరల శ్రేణి..

    ఒక్కో షేరు ధరని రూ. 225 నుంచి రూ.237 గా నిర్ణయించారు. ఒక లాట్‌లో 63 షేర్లున్నాయి. ఈ ఐపీవోలో పాల్గొనాలనుకునేవారు కనీసం 63 షేర్ల కోసం రూ. 14,931తో బిడ్‌ వేయాల్సి ఉంటుంది.

    IPO | కోటా, జీఎంపీ..

    క్యూఐబీలకు 50 శాతం, ఎన్‌ఐఐలకు 15 శాతం, రిటైల్‌ ఇన్వెస్టర్లకు 35 శాతం కోటా ఇచ్చారు. ఈ కంపెనీ షేర్లకు జీఎంపీ రూ. 103 గా ఉంది. అంటే ఐపీవో అలాట్‌ అయినవారికి లిస్టింగ్‌ రోజు 43 శాతం లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

    More like this

    Movements and Protests | రెండు దేశాలు.. రెండు ఉద్యమాలు.. ప్రభుత్వాలను కూల్చేసిన నిరసనలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Movements and Protests | రెండు దేశాల్లో రగిలిన రెండు ఉద్యమాలు అక్కడి ప్రభుత్వాలను...

    Kamareddy | ఊపిరితిత్తులలో ఇరుక్కున్న శనగ గింజ.. చికిత్స చేసి తొలగించిన వైద్యులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని శ్వాస చెస్ట్ అండ్ జనరల్ ఆస్పత్రిలో (Swasah Chest and General...

    Minister Nitin Gadkari | వరద సాయం అందించి కామారెడ్డిని ఆదుకోండి

    అక్షరటుడే, కామారెడ్డి: Minister Nitin Gadkari | భారీ వర్షాలు కామారెడ్డి నియోజకవర్గాన్ని (Kamareddy constituency) అతలాకుతలం చేశాయి....