Homeబిజినెస్​IPO | రేపటినుంచి మరో ఐపీవో.. లిస్టింగ్‌ గెయిన్స్‌ పక్కాయేనా?

IPO | రేపటినుంచి మరో ఐపీవో.. లిస్టింగ్‌ గెయిన్స్‌ పక్కాయేనా?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: IPO | మెయిన్‌ బోర్డు(Main board) నుంచి మరో ఐపీవో (ఇనిషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌) కు వస్తోంది. ఆంథెమ్‌ బయోసైస్సెస్‌ (anthem biosciences) రూ. 3,395 కోట్లు సమీకరించేందుకు సిద్ధమైంది. కంపెనీ(company) షేర్లు ఈనెల 21న లిస్టవనున్నాయి. ఈ కంపెనీ షేర్లు గ్రే మార్కెట్‌లో 16 శాతం లాభాలతో ట్రేడ్‌ అవుతున్నాయి.

బెంగళూరుకు(bangalore) చెందిన ఆంథెమ్‌ బయోసైస్సెస్‌ సీఆర్‌డీఎం(కాంట్రాక్ట్‌ రీసెర్చ్‌, డెవలప్‌మెంట్‌ మాన్యుఫాక్చరింగ్‌) రంగంలో సేవలందిస్తోంది. డ్రగ్‌ డిస్కవరీ(drug discovery), డెవలప్‌మెంట్‌, మాన్యుఫాక్చరింగ్‌ ప్రాసెస్‌ కలిగిన పూర్తి సమగ్ర కార్యకలాపాలతో కూడిన టెక్నాలజీ ఫోకస్డ్‌(technology focused) కంపెనీ ఇది. ఇన్వెస్టర్లనుంచి రూ. 3,395 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఈ కంపెనీ ఐపీవోకు(IPO) వస్తోంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా రూ. 2 ముఖ విలువ కలిగిన 5,95,61,404 షేర్లను విక్రయించడం ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించనున్నారు. పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కావడంతో ఐపీవో ద్వారా వచ్చే మొత్తం డబ్బులు కంపెనీ షేర్స్‌ విక్రయించిన షేర్‌ హోల్డర్స్‌కు వెళతాయి.

IPO | ప్రైస్‌ బాండ్‌..

కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు(equity share) ధరను రూ. 540 నుంచి రూ. 570 మధ్య నిర్ణయించింది. ఐపీవోలో పాల్గొనాలనుకునేవారు కనీసం 26 షేర్లకోసం రూ. 14,820 తో బిడ్‌ వేయాల్సి ఉంటుంది.

IPO | ముఖ్యమైన తేదీలు

ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌(subscription) సోమవారం ప్రారంభంకానుంది. 16 వ తేదీ వరకు బిడ్లు దాఖలు చేయడానికి గడువుంది. 17న రాత్రి అలాట్‌మెంట్‌ స్టేటస్‌ వెల్లడయ్యే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు ఈనెల 21 న ప్రముఖ స్టాక్‌ ఎక్స్ఛేంజీలు అయిన ఎన్‌ఎస్‌ఈ(NSE), బీఎస్‌ఈ(BSE)లలో లిస్ట్‌ కానున్నాయి.

IPO | కోటా, జీఎంపీ..

ఐపీఓలో క్యూఐబీ(QIB)లకు 50 శాతం, ఎన్‌ఐఐలకి 15 శాతం, రిటైల్‌ ఇన్వెస్టర్లకు 35 శాతం వాటాను కేటాయించారు. ఈ కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్‌ ప్రీమియం (GMP) రూ. 93 లుగా ఉంది. ఐపీవో అలాట్‌ అయితే లిస్టింగ్‌ రోజు 16 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి.

IPO | కంపెనీ పరిస్థితి..

2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 1,483 కోట్ల ఆదాయాన్ని సంపాదించడం ద్వారా రూ. 367 కోట్ల లాభాలను పొందింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం(revenue) 1,930 కోట్లకు పెరిగింది. లాభాలు రూ. 451 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో కంపెనీ ఆస్తులు రూ. 2,398 కోట్లనుంచి రూ. 2,807 కోట్లకు పెరిగాయి.