Homeబిజినెస్​Vikran Engineering IPO | రేపటినుంచి మరో ఐపీవో

Vikran Engineering IPO | రేపటినుంచి మరో ఐపీవో

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vikran Engineering IPO | వివిధ రంగాలలో ఈపీసీ సేవలందిస్తున్న విక్రాన్‌ ఇంజినీరింగ్‌ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. మంగళవారం నుంచి సబ్‌స్క్రిప్షన్‌ (Subscription) ప్రారంభం కానుంది. ఈ కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్‌లో డిమాండ్‌ ఉంది. ఐపీవో వివరాలు తెలుసుకుందామా..

విక్రాన్ ఇంజినీరింగ్ (Vikran Engineering) కంపెనీని 2008లో ప్రారంభించారు. ఇది ఈపీసీ విషయంలో అగ్రశ్రేణి సంస్థలలో ఒకటిగా నిలుస్తోంది. విద్యుత్, నీరు, రైల్వే మౌలిక సదుపాయాలతో సహా బహుళ రంగాలలో ప్రసిద్ధి చెందింది. రూ. 772 కోట్లను సమీకరించేందుకు ఈ కంపెనీ ఐపీవో(IPO)కు వస్తోంది. ఇందులో ఫ్రెష్‌ ఇష్యూ ద్వారా రూ. 721 కోట్లు, 52,57,731 ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌(OFS) ద్వారా విక్రయించడం ద్వారా మిగతా మొత్తాన్ని సమీకరించనుంది.

ధరల శ్రేణి..

ఒక్కో షేరు ధరను రూ. 92 నుంచి రూ.97 గా నిర్ణయించింది. ఒక లాట్‌(Lot)లో 148 షేర్లున్నాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు ఒక లాట్‌ కోసం గరిష్ట ప్రైస్‌ బాండ్‌ వద్ద రూ. 14,356తో దరఖాస్తు చేసుకోవాలి.

ఆర్థిక పరిస్థితి..

2024లో రూ.791.44 కోట్లుగా ఉన్న ఈ కంపెనీ ఆదాయం(Revenue) 2025లో రూ.922.36 కోట్లకు చేరింది. ఇదే సమయంలో నికర లాభం(Net profit) రూ.74.83 కోట్ల నుంచి రూ.77.82 కోట్లకు పెరిగింది. కంపెనీ ఆస్తులు(Assets) రూ. 959.79 కోట్లనుంచి రూ. 1,354.68 కోట్లకు చేరుకున్నాయి.

కోటా, జీఎంపీ..

రిటైల్ కోటా 35 శాతం, క్యూఐబీ(QIB) కోటా 50 శాతం, హెచ్‌ఎన్‌ఐ కోటా 15 శాతం. చిన్న ఇష్యూ కావడంతో ఈ కంపెనీ షేర్లకు ‍గ్రే మార్కెట్‌లో డిమాండ్‌ ఉంది. ఒక్కో షేరు రూ. 18 ‍ప్రీమియం ఉంది. అంటే లిస్టింగ్‌ సమయంలో 18 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు..

విక్రాన్ ఇంజనీరింగ్ ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌ 26న ప్రారంభమై 29 ముగుస్తుంది. వచ్చేనెల ఒకటో తేదీన షేర్ల తాత్కాలిక కేటాయింపు స్టేటస్‌ వెల్లడయ్యే అవకాశాలున్నాయి. 3వ తేదీన బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో షేర్లు లిస్ట్ అవుతాయి.