ePaper
More
    Homeబిజినెస్​M & B Engineering IPO | నేటినుంచి మరో ఐపీవో.. జీఎంపీ ఎంతంటే..

    M & B Engineering IPO | నేటినుంచి మరో ఐపీవో.. జీఎంపీ ఎంతంటే..

    Published on

    అక్షరటుడేర, వెబ్​డెస్క్ : M & B Engineering IPO | దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో ఐపీవో(IPO)ల జాతర కొనసాగుతోంది. బుధవారం నుంచి మరో కంపెనీ పబ్లిక్‌ ఇష్యూ (Public issue) ప్రారంభం అవుతోంది. ప్రీ ఇంజినీరింగ్ బిల్డింగ్స్, సెల్ఫ్ సపోర్టడ్ రూఫింగ్ సొల్యూషన్స్ తయారు చేసి ఇన్స్టాల్ చేసే కంపెనీ అయిన ఎం అండ్‌ బీ ఇంజినీరింగ్ (M &B Engineering) లిమిటెడ్ ఐపీవోకు వస్తోంది. ఈ కంపెనీ ఐపీవో ద్వారా రూ. 650 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

    ఇందులో భాగంగా రూ. 10 ఫేస్ వ్యాల్యూ కలిగిన 71,42,857 షేర్లను ఫ్రెష్ ఇష్యూ (Fresh issue) కింద జారీ చేస్తోంది. తద్వారా రూ. 275 కోట్లను సమీకరించనుంది. అలాగే ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద 97,40,259 షేర్లను విక్రయించడం ద్వారా రూ. 375 కోట్లు పొందనుంది. ఈ ఐపీవో ద్వారా వచ్చిన ఆదాయాన్ని కంపెనీకి చెందిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవసరాల కోసం, కంపెనీ తీసుకున్న రుణాలను పూర్తిగా లేదా పాక్షికంగా చెల్లించడం కోసం, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

    ఐపీవో తేదీలు..

    ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌ (IPO Subscription) బుధవారం ప్రారంభం కానుంది. ఆగస్టు ఒకటి వరకు బిడ్డింగ్‌కు గడువుంది. నాలుగో తేదీన షేర్స్‌ అలాట్‌మెంట్ వెల్లడయ్యే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు ఆరో తేదీన ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో లిస్ట్ కానున్నాయి.

    ధరల శ్రేణి..

    ఈ ఐపీవో ప్రైస్ బ్యాండ్ (Price band) ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 366 నుంచి రూ. 385లుగా నిర్ణయించింది. ఒక లాట్‌లో 38 షేర్లున్నాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు గరిష్ట ప్రైస్‌బాండ్‌ వద్ద ఒక లాట్‌ కోసం రూ. 14,630 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

    కోటా, జీఎంపీ..

    ఈ ఐపీవోలో క్యూఐబీ(QIB)లకు 75 శాతం, ఎన్ఐఐలకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 10 శాతం వాటాను కేటాయించారు. ఈ కంపెనీకి గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) రూ. 43లుగా ఉంది. ఒకవేళ ఐపీవో అలాట్‌ అయితే లిస్టింగ్‌ రోజు 11 శాతం వరకు లిస్టింగ్ గెయిన్స్ వచ్చే అవకాశాలున్నాయి.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 1 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081...

    child marriage | 13 ఏళ్ల బాలిక మెడలో తాళి కట్టిన 40 ఏళ్ల వ్యక్తి.. హైదరాబాద్​కు కూతవేటు దూరంలోనే ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి

    అక్షరటుడే, హైదరాబాద్: child marriage : బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. నిత్యం ఎక్కడో...

    HCA | HCAలో కుదుపు.. అధ్యక్షుడు జగన్ మోహన్ రావు సస్పెన్షన్​

    అక్షరటుడే, హైదరాబాద్: HCA హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association - HCA) భారీ కుదుపునకు గురైంది. HCA...

    Anil Eravatri | బ్రిటీషర్ల తొత్తు..దేశ ద్రోహి వీర్​ సావర్కర్​ : ఈరవత్రి అనిల్​

    అక్షరటుడే, ఇందూరు: Anil Eravatri : వీర్ సావర్కర్ పదేళ్లు జైళ్లో ఉన్నా.. దేశానికి అవసరమైన సమయంలో మాత్రం...

    More like this