అక్షరటుడే, వెబ్డెస్క్ : New IPO | ఆధునిక భద్రత, నిఘా పరికరాల వ్యాపారం చేసే ఆదిత్య ఇన్ఫోటెక్(Aditya Infotech) సంస్థ ఐపీవోకు వచ్చింది. పబ్లిక్ ఇష్యూ(Public issue) ద్వారా రూ. 1,300 కోట్లు సమీకరించాలన్నది లక్ష్యం. సబ్‌స్క్రిప్షన్ మంగళవారం ప్రారంభం అయ్యింది.
ఆదిత్య ఇన్ఫోటెక్ కంపెనీ సీపీ ప్లస్(CP plus) బ్రాండ్ పేరుతో ఆధునిక భద్రత, నిఘా పరికరాల వ్యాపారం నిర్వహిస్తుంది. స్మార్ట్ హోం LoT కెమెరాలు, HD అనలాగ్ సిస్టమ్‌లు, AI పవర్డ్ సొల్యూషన్స్(ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్, పీపుల్ కౌంటింగ్ అండ్ హీట్ మ్యాపింగ్), అధునాతన నెట్‌వర్క్ కెమెరాలు, బాడీ వోర్న్, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు, లాంగ్ రేంజ్ ఐఆర్ కెమెరాలను తయారు చేసి, విక్రయిస్తుంటుంది. ఈ కంపెనీ ఐపీవో(IPO) ద్వారా రూ. 1,300 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. ఇందులో ఒక రూపాయి ముఖ విలువ కలిగిన 74 లక్షల తాజా షేర్లను జారీ చేయడం ద్వారా రూ. 500 కోట్లు, 1.18 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించి రూ. 800 కోట్లు సమీకరించాలన్నది లక్ష్యం.
New IPO | ప్రైస్‌బాండ్..
గరిష్ట ప్రైస్ బాండ్(Price band) వద్ద ఒక రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేర్(Equity share) ధర రూ. 675గా ఉంది. ఒక లాట్‌లో 22 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఒక లాట్ కోసం రూ. 14,850 తో బిడ్ వేయాల్సి ఉంటుంది.
New IPO | కోటా, జీఎంపీ..
క్యూఐబీలకు 75 శాతం, ఎన్‌ఐఐ(NII)లకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 10 శాతం షేర్లు కేటాయించనున్నారు. కంపెనీకి జీఎంపీ(GMP) ఒక్కో షేరుకు రూ. 260 ఉంది. అంటే లిస్టింగ్ రోజు 38 శాతం లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.
New IPO | ముఖ్యమైన తేదీలు..
మంగళవారం ప్రారంభమైన ఐపీవో సబ్‌స్క్రిప్షన్(Subscription) గడువు గురువారంతో ముగుస్తుంది. శుక్రవారం రాత్రి షేర్ల అలాట్‌మెంట్ స్టేటస్ తెలిసే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు ఆగస్టు 5న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్ కానున్నాయి.