అక్షరటుడే, వెబ్డెస్క్ : Saatvik Green Energy IPO | దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఐపీవో(IPO)ల సందడి కొనసాగుతోంది. రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్‌కు చెందిన సాత్విక్ గ్రీన్ ఎనర్జీ (Saatvik Green Energy)కంపెనీ పబ్లిక్ ఇష్యూ శుక్రవారం ప్రారంభమవుతుంది. ఈ కంపెనీ షేర్లు గ్రే మార్కెట్‌లో 14 శాతం ప్రీమియంతో ట్రేడ్ అవుతున్నాయి.
సాత్విక్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ భారతదేశంలోని ప్రముఖ సోలార్ మాడ్యూల్(Solar Modules) తయారీదారులలో ఒకటి. ఇది మాడ్యూల్ తయారీతో పాటు ఇంజినీరింగ్, సేకరణ, నిర్మాణం(EPC), కార్యకలాపాలు, నిర్వహణ (O&M) సేవలలో సామర్థ్యాలు కలిగిన కొన్ని కంపెనీలలో ఒకటిగా గుర్తింపు పొందింది. కంపెనీ ప్రధానంగా దాని ద్వారా చేపట్టిన ఈపీసీ ప్రాజెక్టులకు సంబంధించి వినియోగదారులకు ఓ అండ్ ఎం సేవలను కూడా అందిస్తుంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి దీని ఆపరేషనల్ సోలార్ ఫొటోవోల్టాయిక్ (PV) మాడ్యూల్ తయారీ సామర్థ్యం దాదాపు 3.80 గిగావాట్(Gw) మాడ్యూళ్ల కార్యాచరణ సామర్థ్యం ఉంది. ఇది భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మాడ్యూల్ తయారీ కంపెనీలలో ఒకటిగా నిలుస్తూ దేశీయ సౌరశక్తి మార్కెట్‌లో కీలక పాత్ర పోషిస్తోంది.
Saatvik Green Energy IPO | రూ. 900 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో..
ఈ కంపెనీ రూ. 900 కోట్లను సమీకరించడం కోసం ఐపీవోకు వచ్చింది. ఇందులో ఫ్రెష్ ఇష్యూ(Fresh issue) రూ. 700 కోట్లు కాగా.. మిగిలినది ఆఫర్ ఫర్ సేల్ ద్వారా సమీకరించనుంది. ఐపీవో ద్వారా వచ్చిన ఆదాయాన్ని కంపెనీ రుణాలను పాక్షికంగాగాని పూర్తిగా గాని చెల్లించడానికి, అనుబంధ సంస్థ అయిన సాత్విక్ సోలార్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రుణాల తిరిగి చెల్లింపు, ముందస్తు చెల్లింపు కోసం రుణం లేదా ఈక్విటీ రూపంలో పెట్టుబడి పెట్టడం, ఒడిశాలోని గోపాల్‌పూర్ ఇండస్ట్రియల్ పార్క్‌లో 4 జీడబ్ల్యూ సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి పెట్టుబడి కోసం, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.
Saatvik Green Energy IPO | ధరల శ్రేణి
కంపెనీ ప్రైస్‌బాండ్(Price band)ను ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 442 నుంచి రూ. 465గా నిర్ణయించింది. లాట్ సైజ్ 32. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్ బాండ్ వద్ద రూ. 14,880 తో బిడ్ వేయాల్సి ఉంటుంది.
Saatvik Green Energy IPO | కోటా, జీఎంపీ..
క్యూఐబీలకు 50 శాతం, రిటైల్ ఇన్వెస్టర్(Retail investors)లకు 35 శాతం, ఎన్‌ఐఐలకు 15 శాతం కోటా కేటాయించారు. ఈ కంపెనీ షేర్ల జీఎంపీ రూ. 65 ఉంది. అంటే లిస్టింగ్ సమయంలో 14 శాతం లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Saatvik Green Energy IPO | ముఖ్యమైన తేదీలు..
ఐపీవో సబ్‌స్క్రిప్షన్(Subscription) శుక్రవారం ప్రారంభమై ఈనెల 23 వరకు కొనసాగుతుంది. 24 న రాత్రి అలాట్‌మెంట్ స్టేటస్ వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. కంపెనీ షేర్లు ఈనెల 26న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్ అవుతాయి.