అక్షరటుడే, వెబ్డెస్క్ : Solarworld Energy IPO | దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఐపీవో(IPO)లు క్యూ కట్టాయి. సోలార్ పవర్ సెక్టార్‌నుంచి మరో కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. సోలార్‌వరల్డ్ ఎనర్జీ సబ్‌స్క్రిప్షన్ మంగళవారం ప్రారంభమై గురువారం వరకు కొనసాగనుంది.
సోలార్‌వరల్డ్ ఎనర్జీ (Solarworld Energy) 2013లో స్థాపించబడింది. ఇది సౌరశక్తి పరిష్కారాలను అందించడంలో పాలుపంచుకుంటున్న కంపెనీలలో ఒకటి, సౌరశక్తి ప్రాజెక్టులకు ఇంజినీరింగ్, సేకరణ మరియు నిర్మాణ సేవలపై దృష్టి సారించింది. ఈ కంపెనీ వినియోగదారుల అవసరాలను తీర్చే సౌరశక్తి ప్రాజెక్టులను ఏర్పాటు చేసింది. దాని పీఎస్‌యూలు, సీ అండ్ ఐ (C&I) క్లయింట్‌లకు పూర్తి మరియు సరసమైన పరిష్కారాలను అందిస్తోంది. ఇది 253.67 ఎండబ్ల్యూ(ఏసీ)/ 336.17 ఎండబ్ల్యూ(డీసీ) మొత్తం సామర్థ్యంతో అనేక ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రస్తుతం 420 ఎండబ్ల్యూ(ఏసీ) / 592 ఎండబ్ల్యూ (డీసీ) మొత్తం సామర్థ్యంగల అనేక ప్రాజెక్టుల ఆర్డర్‌లున్నాయి.
సౌరశక్తి ప్రాజెక్టులను రూపొందించడం, ఇన్‌స్టాల్ చేయడం, ఏర్పాటు చేయడం వంటి సేవలను అందించడం ద్వారా ప్రారంభం నుంచి ముగింపు వరకు అన్ని సేవలను అందిస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ నుంచి రూ.490 కోట్లను సేకరించడం కోసం ఐపీవోకు వస్తోంది. ఇందులో రూ. 440 కోట్లు ఫ్రెష్ ఇష్యూ(Fresh issue) కాగా.. మిగిలినది ఆఫర్ ఫర్ సేల్. ఐపీవో ద్వారా సమకూరిన నిధులను అనుబంధ సంస్థ ఏర్పాటు చేసే పంధురానా ప్రాజెక్టు స్థాపనకు పాక్షిక ఆర్థిక సహాయం కోసం, ఇతర సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ఆర్థిక పరిస్థితి..
2024లో రూ.505.50 కోట్లుగా ఉన్న ఈ కంపెనీ ఆదాయం(Revenue) 2025లో రూ.551.09 కోట్లకు చేరింది. ఇదే సమయంలో నికర లాభం (Net Profit) రూ.51.69 కోట్ల నుంచి రూ.77.05 కోట్లకు పెరిగింది.
ధరల శ్రేణి..
సోలార్‌వరల్డ్ ఎనర్జీ ఐపీవో ప్రైస్‌బాండ్(Price band)ను ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 333 నుంచి రూ. 351 గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 42 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు గరిష్ట ప్రైస్‌బాండ్ వద్ద రూ. 14,742 తో బిడ్ వేయాల్సి ఉంటుంది.
కోటా, జీఎంపీ..
క్యూఐబీలకు 75శాతం, ఎస్‌ఐఐలకు 15 శాతం, రిటైల్ కోటా(Retail quota) 10 శాతం కేటాయించారు. ఈ కంపెనీ షేర్లకు రూ. 65 జీఎంపీ ఉంది. అంటే లిస్టింగ్ సమయంలో 18 శాతం లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు..
ఈ కంపెనీ ఐపీవో మంగళవారం ప్రారంభమై గురువారం ముగుస్తుంది. శుక్రవారం రాత్రి అలాట్‌మెంట్ స్టేటస్ వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈనెల 30న కంపెనీ షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతాయి.