అక్షరటుడే, వెబ్డెస్క్ : Pace Digitek IPO | టెలికాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(Telecom Infrastructure), ఎనర్జీ సొల్యూషన్స్ అందించే పేస్ డిజిటెక్ కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. 26న ప్రారంభమయ్యే సబ్‌స్క్రిప్షన్ 30వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ కంపెనీ షేర్లకు జీఎంపీ(GMP) 15 శాతంగా ఉంది.
టెలికాం మౌలిక సదుపాయాల పరిశ్రమకు చెందిన పేస్ డిజిటెక్(Pace Digitek) లిమిటెడ్‌ను 2007లో స్థాపించారు. ఇది దేశంలోనే కాకుండా విదేశాలలోనూ టెలికాం రంగంలో సేవలందిస్తోంది. టెలికాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ సొల్యూషన్స్, ఐసీటీ సర్వీసెస్‌లో పనిచేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ నుంచి రూ. 819.15 కోట్లను సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవో(IPO)కు వస్తోంది. రూ. 2 ముఖ విలువ కలిగిన 3.74 కోట్ల తాజా షేర్ల(Fresh issue)ను జారీ చేయడం ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించనుంది. ఐపీవో ద్వారా వచ్చిన ఆదాయాన్ని క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.
ధరల శ్రేణి : ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 208 నుంచి రూ. 219గా నిర్ణయించారు. లాట్ సైజు(Lot size) 68 షేర్లు. రిటైల్ ఇన్వెస్టర్లు గరిష్ట ప్రైస్ బాండ్ వద్ద కనీసం ఒక లాట్ కోసం రూ. 14,892 తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా 14 లాట్లకు బిడ్ వేయవచ్చు.
కోటీ, జీఎంపీ : క్యూఐబీ(QIB)లకు 50 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం, ఎన్‌ఐఐలకు 15 శాతం కోటా కేటాయించారు. కంపెనీ షేర్లకు జీఎంపీ రూ. 33 గా ఉంది. అంటే ఐపీవో అలాట్ అయినవారికి లిస్టింగ్ సమయంలో 15 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
ఆర్థిక పరిస్థితి : కంపెనీ 2023 -24 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,460.27 కోట్ల ఆదాయం(Revenue) సంపాదించగా.. కంపెనీ 2024 -25 ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా పెరిగి రూ. 2,462.20 కోట్లకు చేరింది. ఇదే సమయంలో నికర లాభం(Net profit) రూ. 229.87 కోట్లనుంచి రూ. 279.10 కోట్లకు పెరిగింది. ఆస్తులు రూ. 2,253.87 కోట్లనుంచి రూ. 2,648.96 కోట్లకు చేరాయి.
ముఖ్యమైన తేదీలు : సబ్‌స్క్రిప్షన్(Subscription) శుక్రవారం ప్రారంభమై 30 న ముగుస్తుంది. అక్టోబర్ 1న రాత్రి షేర్ల అలాట్‌మెంట్ స్టేటస్ వెల్లడయ్యే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు అక్టోబర్ 6న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్ అవుతాయి.